బాలీవుడ్ హాట్ బ్యూటీ కీయరా అద్వానీ మరోసారి నార్త్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడు బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుస ఆఫర్లతో బాలీవుడ్ బిజీ హీరోయిన్ గా ఉన్న కీయరా తెలుగులో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి రెడీగా ఉంటుంది.
క్రమశిక్షణ గల హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ లో మాత్రం లవ్ ఎఫైర్స్ తో అప్పుడపుడు కొన్ని ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటోంది. అసలు విషయంలోకి వెళితే.. కీయరా అద్వానీ , బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా కీయరా అద్వానీ వాటిపై పెద్దగా స్పందించమాపోవడం గమనార్హం. అయితే రీసెంట్ గా బాంద్రాలోని సిద్ధార్థ్ ఇంటికి వెళ్లగా ఆమె అనుకోకుండా అభిమానులు కంట పడింది.
ఇక చూసినవాళ్లు మొబైల్ ఫోన్స్ తో ఫొటోలు కూడా తీశారు. ప్రియుడి ఇంట్లోకి వెళ్లిన ఆమె భోజనం చేసి వచ్చిందట. ఇక ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగవచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!