బిగ్ బాస్ 4: హౌస్ మేట్స్ ని ఆడుకున్న కిచ్చ సుదీప్..!

  • November 30, 2020 / 12:12 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లోకి ఎట్టకేలకి ఒక గెస్ట్ వచ్చాడు. కన్నడలో బిగ్ బాస్ హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా షోని రన్ చేస్తున్న కిచ్చ సుదీప్ తెలుగులో ఈసారి సీజన్ లోకి గెస్ట్ గా వచ్చాడు. నాగార్జున హౌస్ మేట్స్ కి ఇంట్రడ్యూస్ చేయకుండా డైరెక్ట్ గా హౌస్ లో పార్టిసిపెంట్స్ తో ఫన్ చేశాడు. నాగార్జున రావాలంటే ఎందుకు రావాలో సరైన రీజన్ చెప్పమని అడిగాడు.

ఇక నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకున్న కిచ్చ సుదీప్ హౌస్ మేట్స్ ని ఫన్నీ ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టాడు. హారికని నిజాయితీగా ఉండటం కావాలా, గెలుపు కావాలా అని అడిగితే హారిక క్లవర్ గా ఆన్సర్ ఇచ్చింది. నిజాయితీగా విన్నర్ అవ్వడం కావాలి అన్నది. దీంతో అలా కుదరదు ఏదో ఒకటి చెప్పమంటే, నేను నిజాయితీగానే ఉంటాను.. గెలుపు ఆటోమేటిక్ గా వస్తుంది. ఒకవేళ ఓడిపోయినా కూడా ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది మనసులో ఉండదు అని చెప్పింది. ఈ ఆన్సర్ సుదీప్ కి బాగా నచ్చింది.

అంతేకాదు, అరియానా కూడా సుదీప్ కి సాలిడ్ ఆన్సర్ చెప్పింది. ఒక్కరోజూ నిద్రలేవగానే అవినాష్ లా మారిపోతే ఫస్ట్ ఏం చేస్తావ్ అన్నాడు సుదీప్. దీనికి అరియానా ఆరోజు అస్సలు నిద్రలేవనని చెప్పింది. అఖిల్ తో మాట్లాడుతూ నువ్వు హౌస్ లో ఎవర్ని మాయం చేయాలని అనుకుంటావ్ అని అడిగితే, మోనాల్ ని అని చెప్పాడు అఖిల్. దీనికి రీజన్స్ చెప్పడానికి సిగ్గుపడుతుంటే, అఖిల్ తో కాసేపు ఆడుకున్నాడు.

అవినాష్, అభిజిత్, సోహైల్, మోనాల్ లని కూడా తనదైన స్టైల్లో ప్రశ్నలు వేశాడు. సండే ఎపిసోడ్ లో ఫన్ ఎంతకావాలో అంత ఇచ్చిన కిచ్చ రచ్చ రచ్చ చేశాడనే చెప్పాలి. చాలా సీరియస్ గా హౌస్ మేట్స్ ని డీల్ చేసిన విధానం చూస్తుంటే, కన్నడలో పార్టిసిపెంట్స్ సుదీప్ ని భరించడం కష్టం అనే అనిపించింది. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus