Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పై అంత నెగిటివిటీ ఏర్పడిందా? ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

  • July 20, 2022 / 11:57 PM IST

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. అటు తర్వాత వచ్చిన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఇతను చేసిన ‘సెబాస్టియన్’ అనే చిత్రం ప్లాప్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన ‘సమ్మతమే’ కొంతవరకు పర్వాలేదు అనిపించింది. ఇదిలా ఉండగా.. ఇక్కడి వరకు కిరణ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. ‘రాజావారు రాణిగారు’ థియేట్రికల్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు.

అది ఓటీటీ హిట్ గా నిలిచింది. తర్వాత ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ కమర్షియల్ సక్సెస్ అందుకున్నప్పటికీ కానీ ఆ సినిమాకి హిట్ టాక్ అయితే రాలేదు. ఇక ‘సెబాస్టియన్’ పెద్ద డిజాస్టర్ కాగా ‘సమ్మతమే’ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కొంచెం పెద్ద ప్రాజెక్టుల్లోనే నటిస్తున్నాడు అని చెప్పాలి. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోకి ఇలాంటి పెద్ద అవకాశాలు రావు అని, అతని సినిమా వేడుకల్లో కూడా స్టార్ హీరోకి ఇచ్చిన బిల్డప్ లు ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఇలాంటి కామెంట్ల పై కిరణ్ అబ్బవరం స్పందించాడు. “షార్ట్‌ ఫిల్మ్స్‌ నుండి ఇప్పటిదాకా నన్ను సపోర్ట్‌ చేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఎదుగుదలకు మీ సపోర్టే కారణం. మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను. నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇన్ని సినిమాల్లో అవకాశాలు ఎలా వస్తున్నాయి? గట్టి సపోర్ట్‌ లేకుండా ఇది సాధ్యం కాదు… అనే కామెంట్లు వింటూనే ఉన్నాను.

వారికి నా సమాధానం ఒక్కటే… ‘హార్డ్‌వర్క్‌’.క్లాసులో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న బాధ కంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు వచ్చాయనే బాధ,నెగిటివిటీనే మనలో ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగిటివిటీనే నామీద వస్తుంది. సో జీవితంలో నేనేదో పాజిటివ్‌గా సాధించానని అర్థం. ఈ పని చేసుకోవడానికే ఎన్నో ఏళ్లు తిరిగాను. అవకాశం వచ్చింది కాబట్టి.. కష్టపడి పని చేస్తున్నాను” అంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు కిరణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus