కోలీవుడ్ డైరక్టర్లకు ఈ ఆలోచన ఎందుకొస్తోందో

  • August 9, 2021 / 01:31 PM IST

దర్శకులు అంటే కేవలం దర్శకత్వం మాత్రమే చేయాలా. మన నటులు ఏమన్నా నటించడం మాత్రమే చేస్తున్నారా? ఈ చర్చ బాగానే ఉంది కదా. ఇది మేం తీసుకొచ్చిన చర్చ కాదు. టాలీవుడ్‌లో వరుసగా దర్శకులు నటులుగా మారడం చూసి సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న చర్చ ఇది. అవును మరో కోలీవుడ్‌ దర్శకుడు నటుడిగా మారిపోయారు. మారిపోవడం కాదు వరుసగా అవకాశాలు సంపాదించి బిజీ అవుతున్నారు కూడా. కోలీవుడ్‌లో దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో కథానాయకుడిగా, ఆ తర్వాత ప్రతినాయకుడిగా మారిపోయారు ఎస్‌.జె.సూర్య.

విభిన్నమైన నటనతో మెప్పిస్తున్నారు కూడా. గౌతమ్‌ మేనన్‌ కూడా నటుడిగా మెప్పించినవారే. ఇక సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాలా… అటు తమిళం, ఇటు తెలుగులో వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ టర్న్‌ సెల్వ రాఘవన్‌కి వచ్చింది. వైవిధ్యమైన దర్శకుడిగా పేరు గాంచిన సెల్వరాఘవన్‌ ఇప్పుడు నటుడిగా మారారు. కీర్తి సురేశ్‌ ‘సాని కాయిదం’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

దీంతోపాటు తాజాగా విజయ్‌ ‘బీస్ట్‌’లో కీలక పాత్రకు సెల్వ రాఘవన్‌ను తీసుకున్నారని సమాచారం. ఇది విలన్‌ పాత్ర అని, సైకో టచ్‌ ఉంటుందని టాక్‌. ఇప్పటికే కోలీవుడ్‌ దర్శకులు సైకో టచ్‌ ఉన్న విలన్‌ పాత్రలు అదరగొట్టేశారు. సెల్వ ఏం చేస్తాడో చూడాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus