Koratala Siva: జాన్వీ కపూర్ కి కొరటాల శివ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?

  • September 16, 2023 / 10:55 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం దేవర. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్నటువంటి ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే ఈ సినిమా కోసం ఎంతోమంది నేటిజన్స్ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఒక అపజయం కూడా ఎరుగని కొరటాల శివకు ఆచార్య సినిమా బారీ డిజాస్టర్ ఇచ్చింది. ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.

అయితే ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాగైనా ఈ సినిమాని సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ఇక ఈ సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూసానని ఈ సినిమాలో అవకాశం రావడం కోసం తాను ఏడాది పాటు దేవుడిని నమస్కరించాను అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే ఈ సినిమాలో అవకాశం రావాలి అంటే జాన్వీ కపూర్ కు కొరటాల ఒక కండిషన్ పెట్టారని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎప్పుడు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇలా తరచూ గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నటువంటి ఈమె ఈ సినిమాలో నటించాలి అంటే ట్రెడిషనల్ లుక్ లో కనిపించాలని కండిషన్ పెట్టారట. ఈ సినిమాలో తన పాత్ర అలాగే ఉండబోతుందని అందుకు తగ్గ వస్త్రధారణ నడవడిక ఉండాలని వీటిలో సెలెక్ట్ అయితే ఈ సినిమా అవకాశం వస్తుందంటూ కండిషన్ పెట్టారనీ తెలుస్తుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus