కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫిమేల్ సెంట్రిక్ అండ్ సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’(Kotha Lokah Chapter 1). దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించాడు.
ఆగస్టు 29న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త లోక’ ని రిలీజ్ చేయడం జరిగింది.
అయితే ఊహించని విధంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక్కడ షో షోకి బుకింగ్స్ పెరుగుతూ వచ్చాయి. అందువల్ల తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది అని చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| ఏపీ+తెలంగాణ | 6.5 cr (షేర్) |
| కేరళ | 63.65 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 15.23 cr |
| ఓవర్సీస్ | 45.20 cr |
| వరల్డ్ టోటల్ | 130.58 cr (షేర్) |
‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ..ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.130.58 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.110.58 కోట్ల లాభాలు అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక్కడి బయ్యర్స్ కి రూ.4 కోట్ల ప్రాఫిట్స్ అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.