విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్డమ్’(Kingdom). ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2025 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.టీజర్, ట్రైలర్లు వంటివి ఆకట్టుకున్నాయి. అనిరుథ్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా మంచి రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి.
అయితే మొదటి రోజున సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది పర్వాలేదు అన్నారు.. ఇంకొంతమంది విజయ్ దేవరకొండ రీసెంట్ సినిమాల్లో ఇది బెటర్ అన్నారు.
అనువల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ వీక్ డేస్లో మళ్ళీ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేసింది లేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 12.32 cr |
| సీడెడ్ | 4.50 cr |
| ఉత్తరాంధ్ర | 3.58 cr |
| ఈస్ట్ | 2.03 cr |
| వెస్ట్ | 1.21 cr |
| గుంటూరు | 1.70 cr |
| కృష్ణా | 1.38 cr |
| నెల్లూరు | 0.93 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 27.65 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.79 cr |
| మిగిలిన వెర్షన్లు | 0.72 cr |
| ఓవర్సీస్ | 9.59 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 42.75 cr (షేర్) |
‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.42.75 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.79.18 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.9.25 కోట్ల(షేర్) నష్టాలు బయ్యర్స్ కి మిగిల్చి ప్లాప్ గా మిగిలిపోయింది ఈ సినిమా.