Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నస్లెన్, (Hero)
  • కళ్యాణి ప్రియదర్శన్, (Heroine)
  • టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ తదితరులు (Cast)
  • డామినిక్ అరుణ్ (Director)
  • దుల్కర్ సల్మాన్ (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • నిమిష్ రావి (Cinematography)
  • చమన్ చాకో (Editor)
  • Release Date : ఆగస్టు 28, 2025
  • వేఫేరర్ ఫిలిమ్స్ (Banner)

‘హలో’ ‘చిత్రలహరి’ వంటి సినిమాలతో హీరోయిన్ గా అలరించిన కళ్యాణి ప్రియదర్శన్ అందరికీ సుపరిచితమే. ‘ప్రేమలు’ ‘అలప్పుజ జింఖానా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నస్లెన్. వీరి కాంబినేషన్లో ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ సూపర్ హీరో ఫిలిం ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 29న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ కొంచెం డిలే అయ్యింది. మరి ఈ క్రేజీ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

Kotha Lokah Chapter 1 Review in Telugu

కథ : చంద్ర అలియాస్ నీలా (కళ్యాణి ప్రియదర్శన్) ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఉదయం పూట ఆమె బయటకు రాలేదు..కాబట్టి నైట్ షిఫ్ట్స్ లో ఆమె వర్క్ చేస్తుంటుంది. ఆమె ఎదురింటి ఫ్లాట్లో ఉంటాడు సన్నీ(నెస్లెన్).తొలిచూపులోనే చంద్రని చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ విషయంలో సక్సెస్ అవుతాడు. చంద్ర కూడా సన్నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. మరోపక్క నగరంలో ఓ గ్యాంగ్ కొంతమందిని కిడ్నాప్ చేసి ఆర్గాన్స్ మాఫియా నడుపుతూ ఉంటారు. ఒకానొక టైంలో చంద్రని కూడా కిడ్నాప్ చేస్తారు. ఇది చూసిన సన్నీ ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ క్రమంలో చంద్ర అందరిలాంటి అమ్మాయి కాదు అనే షాకింగ్ నిజం అతనికి తెలుస్తుంది.ఆమెకు సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని అతనికి తెలుస్తుంది. అసలు చంద్ర ఎవరు? ఆమెకు సూపర్ నేచురల్ పవర్స్ ఎందుకు ఉన్నాయి? ఆమెను పోలీస్ అయిన నాచియప్పన్ గౌడ (శాండీ) ఎందుకు టార్గెట్ చేస్తాడు? చంద్ర ఓ టెర్రరిస్ట్ అని ఎందుకు ప్రచారం చేస్తాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ కు దూరంగా చాలా పద్దతిగా గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చింది. మొదటి సారి సూపర్ హీరో టైపు రోల్ చేసింది. ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయింది అనే చెప్పాలి. ఎక్కడా తడబడకుండా చాలా ఈజ్ తో చేసేసింది. నస్లెన్ మరోసారి బాయ్ నెక్స్ట్ డోర్ రోల్లో.. తన మార్క్ కామెడీతో అలరించాడు. అతని ఫ్రెండ్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా కామెడీ బాగానే పండించారు. శాండీ ఓ క్రూయల్ పోలీస్ గా కరెక్ట్ గా సెట్ అయ్యాడు. అతన్ని ఇంకా క్రూరంగా చూపించే అవకాశం ఉన్నా ఎందుకో దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోలేదు. అతిథి పాత్రలో టోవినో థామస్ మెప్పిస్తాడు. దుల్కర్ సల్మాన్ కూడా చిన్న గెస్ట్ రోల్ చేశాడు. మిగతా వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : తెలుగులో ‘ఇంద్రాణి’ వంటి ఫిమేల్ సూపర్ హీరో ఫిలిమ్స్ తీసే ప్రయత్నాలు చేశారు. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదు.ఈ విషయంలో మలయాళ దర్శకుడు డామినిక్ అరుణ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.మైథలాజికల్ టచ్ ఇచ్చి చాలా కన్విన్సింగ్ గా వరల్డ్ బిల్డింగ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రోల కోసం పెద్ద హడావిడి చేయకుండానే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత హీరో పాత్రతో కామెడీ పండించి.. ఆ వెంటనే హీరోయిన్ కి పడాల్సిన ఎలివేషన్ సీన్లు బాగానే తీసుకొచ్చాడు. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ప్రజెంట్ ట్రాక్ ను ముడిపెట్టిన విధానం కూడా టార్గెటెడ్ ఆడియన్స్ కు గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ కే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు దర్శకుడు. అయితే ఆ మ్యాజిక్ ను సెకండాఫ్ లో రిపీట్ చేయలేకపోయాడు అనే చెప్పాలి. సెకండాఫ్ స్టార్టింగ్ స్లోగా వెళ్లినా పర్వాలేదు అనిపిస్తుంది.. కానీ ఎప్పుడైతే పోలీస్ పాత్రకి కూడా హీరోయిన్లా సూపర్ నేచురల్ పవర్స్ వచ్చినట్టు చూపించాలి అనుకున్నాడో అక్కడి నుండి ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగిస్తుంది. క్లైమాక్స్ కూడా హడావిడి, హడావిడిగా ముగుస్తుంది. కానీ సెకండ్ పార్ట్ పై అంత క్యూరియాసిటీ పెంచేలా అయితే సినిమాకి ఎండింగ్ ఇవ్వలేకపోయారు అనే చెప్పాలి. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. జేక్స్ బిజోయ్ సమకూర్చిన నేపధ్య సంగీతం బాగానే ఉంది.. కానీ కొన్ని ట్యూన్స్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తాయి.

విశ్లేషణ : ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మంచి సంతృప్తినిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ను మ్యాచ్ చేయలేకపోయింది అని చెప్పాలి. అయితే ఈ వీకెండ్ కు ఒకసారి కచ్చితంగా థియేటర్లలో ట్రై చేసే విధంగానే ఉంది.

రేటింగ్ : 2.5/5

 ‘పరమ్ సుందరి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus