Prerana: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి ఫోటోలు వైరల్.!

ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారైన సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగానే ఉంది. శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలు.. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి అడుగుపెట్టారు. అలాగే సీరియల్స్ లో నటించే వారు, అలాగే బుల్లితెర పై ఇమేజ్ సంపాదించుకున్న వారు సైతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మధ్యనే బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే సీరియల్ హీరో అయిన మానస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారిక ప్రకటించి ఎంగేజ్మెంట్ ఫోటోలు వంటివి కూడా షేర్ చేశాడు.

తాజాగా మరో సీరియల్ హీరోయిన్ కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆమె మరెవరో కాదు.. ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తో పాపులర్ అయిన ప్రేరణ శ్రీపాద అనే కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. అక్టోబర్ చివర్లో వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా… కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో కృష్ణ అనే అమాయకపు అమ్మాయి పాత్రలో ప్రేరణ నటించింది. అలాగే అంతకు ముందు ఈమె పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో సీరియల్ (Prerana) హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus