సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కాస్త క్రేజ్ పెరిగిన తరువాత కానీ హీరోయిన్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయరు. పైగా ఇది కరోనా కాలం.. మునుపటి మాదిరిగా రెమ్యునరేషన్లు ఇవ్వడానికి నిర్మాతలకు కష్టంగా మారింది. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఏకంగా రూ.70 లక్షలు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తుందట. చేసింది ఒక్క సినిమా.. అది కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఈ బ్యూటీ డిమాండ్ చేస్తున్న పారితోషికం విని నిర్మాతలు షాక్ అవుతున్నారట. మెగాహీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది కృతి శెట్టి.
‘నీ కన్ను నీలి సముద్రం’ అనే వీడియో సాంగ్ రిలీజైనప్పుడు కృతి శెట్టి తన లుక్స్ తో పాపులర్ అయిపోయింది. క్యూట్ గా ఉన్న ఆమెకి యూత్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ కానప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నాని సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు. ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలియదు కానీ.. రీసెంట్ గా కొందరు నిర్మాతలు తమ సినిమాలో నటించమని ఈ హీరోయిన్ ని సంప్రదించగా.. వారు ఆశ్చర్యపోయేలా రేటు వినిపించింది ఈ బ్యూటీ.
రూ.70 లక్షల పారితోషికం, టాప్ బ్యానర్, సరైన కాంబినేషన్ అయితేనే సినిమాలు ఓకే చెబుతుందట. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించకుండా.. టాప్ హీరోల పక్కన ఛాన్స్ ల కోసం చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల సంఖ్య కాస్త తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి డిమాండ్లు వినిపిస్తూనే ఉంటాయి.
Most Recommended Video
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!