Krithi Shetty: రామ్ ఎనర్జీకి మ్యాచ్ అవుతానా అనే అనుమానం వచ్చింది?

Advertisement

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంది. తాజాగా ఈమె ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ది వారియర్ సినిమాలో నటించారు. లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో జూలై 14వ తేదీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి హీరో రామ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రామ్ తో కలిసి దివారియర్ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత ముందుగా ఆయన నటించిన సినిమాలన్నీ చూసాను.అయితే ఆ సినిమాలలో రామ్ ఎనర్జీ చూసిన తర్వాత తన ఎనర్జీకి నేను మ్యాచ్ అవుతానా అనే సందేహం కలిగింది. ఇక ఈ సినిమాలో బుల్లెట్ సాంగ్ పాటకు డాన్స్ చేయాలంటే కాస్త భయపడ్డాను.

అతనితో పాటు డాన్స్ చేయడానికి కాస్త నెర్వస్ గా ఫీలయ్యాను. అయితే ఫ్లోలో అలా ఆ సాంగ్ పూర్తి అయిందని, నేను కూడా ఆ డాన్స్ ఎంజాయ్ చేశానని ఈ సందర్భంగా కృతి శెట్టి తెలిపారు. ఇక కథల ఎంపిక విషయం గురించి మాట్లాడుతూ కథ వినేటప్పుడు తాను ఎంతో ఎంటర్టైన్ గా ఫీల్ అయితే అలాంటి సినిమాలను చేసినప్పుడు ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నా అని తెలిపారు.

ప్రస్తుతం కృతి శెట్టి అన్ని రొమాంటిక్ సినిమాలలో నటిస్తున్న ఈమె ఎప్పటికైనా యాక్షన్ సినిమాలలో నటించాలన్నదే తన కోరిక అని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలు పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాలో రామ్ మొదటిసారిగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus