Krithi Shetty: రోజుకు రెండు మూడుసార్లు ఆ సినిమా చూసేదాన్ని.. కృతి శెట్టి కామెంట్స్ వైరల్!

Advertisement

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా మొదటి సినిమానే హిట్ కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న దివారియర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ఈ సినిమా గురించి, డైరెక్టర్ లింగస్వామి గురించి ఆసక్తికరమైన సమాధానం తెలియజేశారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ లింగ స్వామి గారి దర్శకత్వంలో వచ్చిన ఆవారా సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని,ఈ సినిమా తన జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపారు.

తాను అమ్మమ్మగారి ఊరికి వచ్చిన సమయంలో ఈ సినిమా సీడీని తీసుకొని రోజుకు రెండు మూడు సార్లు తప్పకుండా చూసేదాన్ని అంటూ కృతి శెట్టి ఆవారా సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక లింగ స్వామి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా ఎంతో ఆశ్చర్యపోయానని ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఎంతో సంతోషం వ్యక్తం చేశానని కృతి శెట్టి వెల్లడించారు.

ఆయన దశకత్వంలో వచ్చిన సినిమాలు ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంటాయి కథలు కూడా కొత్తగా ఉంటాయి. దివారియర్ కథ వినగానే ఎంతో ఎక్సైట్ ఫీల్ అయ్యానని అయితే ఈ సినిమా షూటింగ్ ముందు కాస్త నెర్వస్ గా అనిపించింది అంటూ కృతి శెట్టి ఈ సినిమా విషయాలను ఇంటర్వ్యూ సందర్భంగా ముచ్చటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్, టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus