Krithi Shetty: ఆ భయం అలా ఉండిపోయిందన్న కృతిశెట్టి!

  • January 4, 2022 / 06:48 PM IST

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న కృతిశెట్టి శ్యామ్ సింగరాయ్ తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. కృతిశెట్టి నటించిన బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. యూత్ లో ఊహించని స్థాయిలో కృతిశెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సినిమాసినిమాకు కృతిశెట్టికి క్రేజ్, పారితోషికం పెరుగుతోంది.

అందం, అభినయం, ప్రతిభ పుష్కలంగా ఉన్న కృతి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కృతి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. శ్యామ్ సింగరాయ్ స్టోరీ వినే సమయంలోనే ఈ సినిమా రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నానని నాని గారి మాటలు విన్న తర్వాత ఈ సినిమా రిజల్ట్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని కృతి తెలిపారు. అమ్మతో కలిసి మాత్రమే తాను సినిమా కథలను వింటానని కథ విషయంలో అభిప్రాయాన్ని అమ్మతో పంచుకుని అమ్మకు నచ్చితే మాత్రమే ఆ సినిమాలో చేస్తానని కృతిశెట్టి వెల్లడించారు.

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సక్సెస్ సాధించడం సంతోషాన్ని కలిగిస్తోందని కృతి అన్నారు. బేబమ్మ రోల్ కు దూరంగా ఉండే రోల్స్ చేయాలని అనుకున్న సమయంలోనే శ్యామ్ సింగరాయ్ లో కీర్తి రోల్ వచ్చిందని కృతి చెప్పుకొచ్చారు. కృతిశెట్టి దేనికి భయపడతారనే ప్రశ్న ఎదురు కాగా కృతి ఆ ప్రశ్నకు స్పందిస్తూ చిన్నప్పటి నుంచి కింద పడిపోతానేమోనని నాకు భయమని ఈ విషయంలో నన్ను టీజ్ చేస్తుంటారని అన్నారు. బాల్యంలో పడిపోవడం వల్ల ఆ భయం అలా ఉండిపోయిందని కృతి పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను విభిన్నమైన పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నానని యాక్షన్ రోల్ చేయాలనే ఆసక్తి ఉందని కృతి వెల్లడించారు. బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి పాత్రలో నాగచైతన్యకు కృతిశెట్టి నటించారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus