Krithi Shetty: తమిళంలో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి!

Advertisement

ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మొదట్లోనే భారీ విజయం సొంతం చేసుకున్న హీరోయిన్ కృతి శెట్టి పేరు గత ఏడాది నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు అనే సినిమాలతో ఫెస్టివల్స్ లో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కృతి శెట్టి టాప్ లిస్ట్ లోకి చేరుతుంది.

Click Here To Watch Now

ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు కోటి 20 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక కథలను సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా కృతి శెట్టి చాలా తెలివిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఒక స్టోరీ నచ్చకపోతే అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే నచ్చలేదని మొహం మీద చెప్పేస్తుందట. కెరీర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని కథలో పాత్ర చాలా కీలకంగా ఉంటేనే చేయడానికి ఒప్పుకుంటుందట.

ఇక రీసెంట్ గా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్రహీరోతో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సూర్య త్వరలోనే బాల దర్శకత్వం ఒక సరికొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతుండగా ఆ సినిమాకు హీరోయిన్ గా కృతి శెట్టి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి శెట్టి కి చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందినట్లు టాక్. త్వరలోనే దర్శకుడు కథ గురించి పూర్తిగా వివరణ ఇచ్చి ఆమె చేత అగ్రిమెంట్ సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారట.

ఆ సినిమాను సూర్య తన సొంత ప్రొడక్షన్ లోనే తెరకెక్కించబోతున్నాడు. ఇక ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో అయితే మరి కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రామ్ లింగస్వామి కలయికలో వస్తున్న ది వారియర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని తమిళ ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus