లేడీ సూపర్ స్టార్ రేంజ్లో ‘ఉప్పెన’ బ్యూటీ డిమాండ్..!

  • March 5, 2021 / 03:37 PM IST

‘ఉప్పెన’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి.. ఫస్ట్ సింగిల్ లోనే తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. సినిమా విడుదల కాకుండానే ఈమెకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సినిమా ఎలా ఉన్నా.. ఈమె కోసం కచ్చితంగా ఓ సారి ‘ఉప్పెన’ చూడాలని గతేడాది మార్చి లోనే ఫిక్స్ అయిపోయారు. కరోనా కారణంగా ఈ చిత్రం లేట్ గా విడుదలయ్యింది కానీ.. లేకుంటే గతేడాది సమ్మర్ కే విడుదలయ్యేది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ ఒక్క చిత్రంతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. నిజానికి ‘ఉప్పెన’ చిత్రానికి ఈమె అందుకున్న పారితోషికం కేవలం రూ.6 లక్షలట. కానీ ఇప్పుడది రూ.60లక్షల వరకూ పెరిగింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కృతి శెట్టి దగ్గరకి ఓ నిర్మాత వచ్చి తన సినిమాలో హీరోయిన్ గా చెయ్యమని అడిగాడట. అందుకు ఆమె కోటి రూపాయల వరకూ డిమాండ్ చేసిందట. అక్కడితో అయిపోలేదు ఆమె ఫుడ్ మెను, కాస్ట్యూమ్స్, బాడీ గార్డ్ ల ఖర్చు.

కార్ వ్యాన్ ల ఖర్చు.. కలిపి చాలా లెక్క చెప్పిందట. దాంతో ఆ నిర్మాత షాక్ కు గురైనట్టు తెలుస్తుంది.’లేడీ సూపర్ స్టార్ అనుష్క కూడా ఈ స్థాయిలో డిమాండ్ చెయ్యదని’ అతను భావించి సున్నితంగా ఆమెను వద్దనుకుని వచ్చేసాడట. ఒక్కసారి స్టార్ డం అందుకున్న హీరోయిన్ల డిమాండ్ ఇలానే ఉంటుంది మరి. అసలే హీరోయిన్ల హవా 4 లేదా 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఈ గ్యాప్లోనే ఎక్కువ సంపాదించుకోవాలని వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా..!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus