Krithi Shetty: టాలీవుడ్ బేబమ్మ.. మొత్తానికి హ్యాట్రిక్ కొట్టేసింది..!

Advertisement

గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి చిత్రంతోనే సంచలనాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి అంత హైప్ రావడానికి ముఖ్యకారణం కూడా ఈ బెబమ్మే. ‘ఉప్పెన’ విజయం కృతికి మాత్రమే కలిసొచ్చింది. ఆ చిత్రం విజయంతో నాని హీరోగా తెరకెక్కిన ‘శ్యామ్ సింఘా రాయ్’లో కూడా ఈమె అవకాశాన్ని దక్కించుకుంది.అదీ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం ఆమెకి మరో సూపర్ హిట్ ను కట్టబెట్టింది.

ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సర్పంచ్ నాగ లక్ష్మీ పాత్రలో ఆమె కనిపించింది. ఈ చిత్రంలో ఆమె కామెడీని కూడా పండించింది. అలాగే ఇందులో కూడా ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఆమె ‘బంగార్రాజు’ విజయంతో హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసింది. అంతేకాకుండా ఆమెని గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది. ప్రస్తుతం ఆమె కమిట్ అయిన.. రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి చిత్రాలు కనుక విజయం సాధిస్తే.

ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే..! తమిళంలో కూడా ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అవి కూడా పెద్ద సినిమాల్లో..! చూస్తుంటే ఈమె ‘అన్ స్టాపబుల్’ అనే విధంగా దూసుకుపోతున్నట్టు స్పష్టమవుతుంది. అంతేకాదు పారితోషికం విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ మేకర్స్ అభ్యంతరం చెప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు కృతి క్రేజ్ ను ఆమె సక్సెస్ రేటు ను చూసి కుళ్ళుకుంటున్నారనే టాక్ కూడా మొదలైంది..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus