Kriti Sanon: ప్రభాస్ హీరోయిన్ లగ్జరీ కారు కొనేసింది!

  • September 12, 2021 / 09:29 PM IST

టాలీవుడ్ లో ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్ ఆ తరువాత ‘దోచేయ్’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ అవకాశాలతో పాటు హిట్స్ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. తాజాగా ‘మిమి’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ Mercedes-Maybach GLS 600 కారుని తనకు తానే గిఫ్ట్ గా ఇచ్చుకుంది.

దీని ఖరీదు సుమారు రూ.2 కోట్లు ఉంటుందని సమాచారం. సినీ సెలబ్రిటీలకు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం కొత్తమీ కాదు. ఎప్పటికప్పుడు మార్కెట్ లో వచ్చే కొత్త కార్లను సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు కృతి కూడా బ్రాండ్ న్యూ కార్ ను తన సొంతం చేసుకుంది. ఈ కొత్త కారు కృతి కార్ల సేకరణకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ‘మిమి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సీత పాత్ర పోషిస్తుంది.

దీంతో పాటు ‘బచ్చన్ పాండే,’ భేదియా ‘,’ గణపత్ ‘,’ హమ్ దో హమారే దో’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మరికొందరు దర్శకులు ఆమెకి కథలు చెబుతున్నారని సమాచారం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus