శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ (Kuberaa) సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ (Dhanush) హీరోగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున (Nagarjuna) దీపక్ అనే సీబీఐ ఆఫీసర్ రోల్ పోషించారు. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ 4వ రోజు నుండి డౌన్ అవుతూ వస్తున్నాయి. ఎ సెంటర్స్ లో కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. కానీ బి, సి సెంటర్స్ లో బాగా డౌన్ అయ్యాయి. మరోపక్క ధనుష్ (Dhanush) వంటి తమిళ స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా తమిళంలో సరైన కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. ఓవర్సీస్ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 11.76 cr |
సీడెడ్ | 3.49 cr |
ఉత్తరాంధ్ర | 4.23 cr |
ఈస్ట్ | 2.04 cr |
వెస్ట్ | 1.25 cr |
గుంటూరు | 1.75 cr |
కృష్ణా | 1.81 cr |
నెల్లూరు | 0.97 cr |
ఏపీ+తెలంగాణ | 27.3 cr (షేర్) |
తమిళనాడు | 8.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.38 cr |
ఓవర్సీస్ | 14.96 cr |
వరల్డ్ టోటల్ | 56.59 cr (షేర్) |
‘కుబేర’ (Kuberaa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.56.59 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.96.8 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో రూ.3.41 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.