Pawan Kalyan: పవన్ పై అభిమానంతో ఈ విద్యార్థులు చేసిన పని తెలిస్తే వావ్ అనాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను  (Pawan Kalyan) అభిమానులు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు సైతం గ్రాండ్ గా జరుపుకుంటారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా గబ్బర్ సింగ్ (Gabbar Singh)   మూవీ రీరిలీజ్ కానుండగా అదే సమయంలో పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. త్వరలో పవన్ సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ సైతం మొదలుకానున్నాయి.

Pawan Kalyan

అయితే కుప్పంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పవన్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పవన్ ఫోటో ప్రతిబింబించేలా 800 మంది విద్యార్థులు సమాహారంలా ఏర్పడగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పురుషోత్తం అనే పవన్ అభిమాని పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడం జరిగింది. విద్యార్థులతో పవన్ ఫోటో ప్రతిబింబం వచ్చేలా చేయించి ఈ అభిమాని పవన్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

గబ్బర్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో అదుర్స్ అనిపించడంతో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ  (OG Movie) 2025 మార్చి 27వ తేదీన రిలీజ్ కానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత పవన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం కావడంతో ఆయనపై బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో పవన్ నటించిన మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలివే.. అన్ని రూ.కోట్లా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus