పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) మూవీ 2012 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైన సమయంలో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా నిర్మాతకు ఈ సినిమా ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. అయితే గబ్బర్ సింగ్ సినిమా మరికొన్ని గంటల్లో రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలం నుంచి గబ్బర్ సింగ్ రీరిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా పవన్ పుట్టినరోజు కానుకగా ఆదివారం సాయంత్రం నుంచి గబ్బర్ సింగ్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితం అవుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కోస్తాంధ్రలోనే గబ్బర్ సింగ్ 100కు పైగా షోలకు హౌస్ ఫుల్ బుకింగ్స్ జరిగాయని సమాచారం. గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ లో కూడా అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
కర్ణాటకలో కూడా గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేసిన థియేటర్లలో టికెట్స్ దొరకని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ రీరిలీజ్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ 2025లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో 2025ను అభిమానులకు స్పెషల్ గా మార్చబోతున్నారని తెలుస్తోంది. పవన్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. పవన్ సినిమాలు బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించనున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.