అలనాటి హీరోయిన్ కుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈమె బాగా పాపులర్. ఇక ‘కలియుగ పాండవులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా ఖుష్బూ ఆ తరువాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘పేకాట పాపారావ్’ ‘స్టాలిన్’ ‘యమదొంగ’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు చేసింది. ఇక తాజాగా ఈమె హీరో వెంకటేష్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో… ‘కలియుగ పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. “నాకు కాఫీ పిచ్చి ఎక్కువ. ఒక రోజుకి 25 నుంచి 30 కప్పుల వరకూ కాఫీ తాగే దానిని. అయితే ఓసారి షూటింగు టైములో నేను ఎవరిని కాఫీ అడిగినా ఇవ్వడం లేదు. ఆరా తీస్తే.. ‘వెంకటేష్ గారు ఇవ్వొద్దని చెప్పారు’ అని అక్కడి వారు చెప్పారు. ఎందుకా అని గట్టిగా అడిగితే… వెంకటేష్ గారు ప్రొడక్షన్ టీమ్ ను పిలిచి.. ‘ఖుష్బూ అడిగితే ఒక్క కప్పు కాఫీ కూడా ఇవ్వొద్దని’ చెప్పారట. దాంతో వాళ్ళు నాకు కాఫీ ఇవ్వడం మానేశారు. కాఫీ ఎక్కువగా తాగితే హెల్త్ దెబ్బతింటుందని వెంకటేశ్ గారు అలా చేశారు. ఇప్పుడు నేను కాఫీ తాగడం చాలా వరకూ తగ్గించేశాను .. అందుకు కారణం వెంకటేశ్ గారే’ అంటూ చెప్పుకొచ్చింది ఖుష్బూ.
ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?