ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!

గత ఏడాది వరకూ తెలుగు సినిమాలకి ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉండేది. డాలర్ల రూపంలో అత్యధిక కలెక్షన్లు వచ్చేవి. 1 మిలియన్ అనేది మన స్టార్ హీరోలకి కేక్ వాక్ అయిపొయింది. కానీ ఈ ఏడాది పరిస్థితి మొత్తం మారిపోయింది. చెప్పాలంటే.. పెద్ద దెబ్బే పడింది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమా కూడా అక్కడ వసూళ్ళు రాబట్టలేకపోయింది అంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నాని, విజయ్ దేవరకొండ.. వంటి హీరోలకు కూడా ఏడాది ఓవర్సీస్ మార్కెట్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. బహుశా అమెజాన్, నెట్ ఫిక్స్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ వల్ల దెబ్బతిందా.. ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక 2019 ఓవర్సీస్ లో మన సినిమాల పెర్ఫార్మన్స్ మరియు కలెక్షన్ల రిపోర్ట్ ను ఒకసారి గమనిస్తే :

1) సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ 151 వ చిత్రంగా సురేందర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం ఈ ఏడాది ఓవర్సీస్ టాప్ గ్రాసర్ అనే చెప్పాలి. ఈ చిత్రం $ 2470 K (2.4 మిలియన్) డాలర్లను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని అక్కడ భారీ రేట్లకు విక్రయించడంతో బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

2) ఎఫ్2 : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్2’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ లో $2135 K (2.1 మిలియన్) డాలర్లను రాబట్టి.. బయ్యర్స్ అందరికీ లాభాలని అందించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) సాహో : ‘బాహుబలి2’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండీ వచ్చిన ‘సాహో’ చిత్రం ఓవర్సీస్ లో ఒక్క తెలుగు వెర్షన్ కే $2.110 K (2.1 మిలియన్ డాలర్లను) వసూల్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని కూడా భారీ రేట్లకు విక్రయించడంతో అక్కడ ప్లాప్ అనే చెప్పాలి.

4) మహర్షి : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ‘ఓవర్సీస్ కింగ్’ అనే పేరుంది. కానీ ఈఏడాది వచ్చిన ‘మహర్షి’ చిత్రం ఆ పేరుని నిలబెట్టలేకపోయిందనే చెప్పాలి. ఈ చిత్రం అక్కడ $1891 K (1.8 మిలియన్) డాలర్లను మాత్రమే వసూల్ చేసి యావేరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

5) జెర్సీ : ఓవర్సీస్ లో నేచురల్ స్టార్ నానికి కూడా మంచి మార్కెట్ ఉండేది. ‘జెర్సీ’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. కేవలం $1.324 K (1.3 మిలియన్) డాలర్లతో అబౌవ్ యావేరేజ్ గా నిలిచింది.

6) ఓ బేబీ : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం ఓవర్సీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం అక్కడి బయ్యర్స్ అందరికీ లాభాలను అందించింది. ఫైనల్ గా అక్కడ $1.021 K (1 మిలియన్) డాలర్లను వసూల్ చేసింది.

7) నానిన్ గ్యాంగ్ లీడర్ : నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ అంటే.. ఓ రేంజ్ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు. పైగా వీరిద్దరికీ ఓవర్సీస్ లో భారీ మార్కెట్ ఉంది. కానీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా $962K (0.96 మిలియన్) డాలర్లను మాత్రమే రాబట్టి యావేరేజ్ గా నిలిచింది.

8) ఎన్టీఆర్ కథానాయకుడు & ఎన్టీఆర్ మహానాయకుడు : బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో .. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కిన.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అండ్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు రెండింటినీ కలిపి భారీ రేటుకు కొనుగోలు చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు కలిపి 1.5 మిలియన్ డాలర్లను మాత్రమే వసూల్ చేసాయి. ఇందులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ యావరేజ్ గా నిలువగా.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ డిజాస్టర్ గా మిగిలింది.

9) మజిలీ : నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం కూడా ఓవర్సీస్ లో బాగా కలెక్ట్ చేసింది. ఈ చిత్రం అక్కడ $773 K (0.7 మిలియన్) డాలర్లను వసూల్ చేసి అక్కడి బయ్యర్స్ కు లాభాలు అందించింది.

10) వెంకీమామ : వెంకటేష్ ,నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీమామ’ చిత్రం కూడా ఇప్పటి వరకూ $600K (0.6 మిలియన్) డాలర్లను రాబట్టి బయ్యర్స్ ను సేఫ్ జోన్ లోకి నెట్టింది. మరి ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.

11) ప్రతీరోజూ పండగే : సాయి తేజ్ కెరీర్ లో.. అదీ ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ $433 K (0.4 మిలియన్) డాలర్లను వసూల్ చేసి.. బయ్యర్స్ అందరికీ లాభాలు అందించింది. ఇప్పటికీ ఈ చిత్రం డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. మరి ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus