Bigg Boss 5 Telugu: అన్ సీన్ లో ఈసీన్ చూసి తీరాల్సిందే..!

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ఏది చేసినా అది ఎంటర్ టైన్మెంట్ వేలోనే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ రెండువారాలు లోబో చేసిన ఫన్ షోని ఒక లెవల్ కి తీస్కుని వెళ్లింది. ఈవారం లోబో ఎంటర్ టైన్మెంట్ కాస్త తగ్గిందనే అనుకున్నారు అందరూ. కానీ, అన్ సీన్ లో లోబో పవన్ కళ్యాణ్ లాగా యాక్ట్ చేస్తూ చేసిన స్కిట్ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. అయితే, ఇది టెలికాస్ట్ లో లేకపోవడంతో చాలామంది బిగ్ బాస్ లవర్స్ చూడలేకపోయారు.

అందుకే హాట్ స్టార్ అన్ సీన్ లో ఈ సీన్ ని పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ – లోబో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. భూమికలాగా పింకీ బ్లాక్ శారీ కట్టుకుని యాక్ట్ చేస్తే, లోబో పవన్ కళ్యాణ్ రేంజ్ లో యాక్ట్ చేస్తూ అద్దిరిపోయే ఫన్ చేశాడు. స్కిట్ వరకూ మాత్రమే కాకుండా , స్కిట్ అయిపోయిన తర్వాత కూడా రవి లోబోలు కామెడీతో మెప్పించారు. సన్నీ, రవి, లోబో, పింకీ స్కిట్ తర్వాత వీరలెవల్లో ఫన్ చేశారు. ఇంత హైలెట్ సీన్ ని టెలికాస్ట్ ఎందుకు చేయలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, హాట్ స్టార్ లో ఈ సీన్ ని చూసితీరాల్సిందే అంటూ పిక్స్ ని షేర్ చేస్తున్నారు.

కేవలం ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సీన్స్ మాత్రమే కాకుండా, కొన్ని ప్రాధాన్యత ఉన్న మాటలు, హౌస్ మేట్స్ మద్యలో జరిగే డిస్కషన్స్ ని కూడా చూపించడం లేదని చెప్తున్నారు. అంతేకాదు, సన్నీతో గొడవపెట్టుకున్న సిరి ఆ తర్వాత వచ్చి సన్నీని హగ్ చేస్కుని చాలా ఫీల్ అయ్యింది. వీరిద్దరూ కలిసిపోయారు. ఇది కూడా టెలికాస్ట్ లో చూపించలేదు. వీటితో పాటుగా బిగ్ బాస్ హౌస్ లో జరిగే కొన్ని సంఘటనలని ఎందుకు చూపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇవన్నీ చూస్తేనే కదా హౌస్ మేట్స్ పై ఒక అభిప్రాయానికి వచ్చి ఓట్ వేసేది అంటూ ప్రశ్నిస్తున్నారు. అదీ విషయం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus