NTR30: ఎన్టీఆర్ కోసం కొరటాల ప్రయత్నం వర్కౌట్ అవుతుందా..!

  • April 28, 2021 / 08:02 PM IST

కొరటాల శివ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాని కమర్షియల్గానే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా తెరకెక్కించడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. అంతేకాదు తన ప్రతీ సినిమా ద్వారా.. నిన్నటి తరం హీరో,హీరోయిన్లను లేదా పరభాషా నటీమణులను ఎంపిక చేసుకుని బ్రేక్ ఇస్తూ ఉంటాడు. ‘మిర్చి’ తో నదియా, ‘శ్రీమంతుడు’ తో ‘సుకన్య’, ‘జనతా గ్యారేజ్’ తో మోహన్ లాల్ వంటి వారికి అవకాశాలు కల్పించాడు. ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్ కియారా అద్వానీ ని కూడా టాలీవుడ్ కు పట్టుకొచ్చాడు.

తన సినిమాల్లో.. అది కూడా కాస్టింగ్ విషయంలో ఇలా ఏదో ఒక ప్రత్యేకత చూపించడం కొరటాల స్టైల్. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి కూడా కొరటాల ఇదే పద్దతిని ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నాడు. కానీ కొరటాలకు ఎన్టీఆర్ అడ్డుపడుతున్నట్టు టాక్. విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ లలో ఎవరో ఒకరిని ఓ ముఖ్య పాత్రకు ఎంపిక చేసుకోవాలని కొరటాల భావిస్తున్నాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం అలా వద్దని అడ్డు పడుతున్నాడట. ఎన్టీఆర్ కు అప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తో నటించాలని కోరిక ఉందట.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి బ్రతిమిలాడాడు అనే కన్సర్న్ తో తప్ప.. తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె ఆశపడలేదు. ఆ తరువాత విజయశాంతికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. భారీగా పారితోషికం ఇస్తామని కూడా ఆమెకు ఆఫర్లు ఇచ్చారు. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. మరి కొరటాలకు మాత్రం ఓకే చెబుతుందా.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus