బుల్లితెరపై యాంకర్ గా క్లిక్కయితే చాలు ఒక మంచి కెరీర్ సెట్టయినట్లే. అతి చేయకుండా ఆడియెన్స్ ను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. అయితే ఒకప్పుడు బెస్ట్ యాంకర్స్ జోడిగా గుర్తింపు అందుకున్న వారిలో రవి, లాస్య. ఈ ఇద్దరు మా మ్యూజిక్ లోని సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ ద్వారా అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఈటీవీ డీ షోలో కూడా టీమ్ లీడర్స్ గా కొనసాగుతూ వారి టాలెంట్ ను మరింత పెంచుకున్నారు.
ఇక ఇద్దరి కెరీర్స్ హ్యాపీగా సాగిపోతున్న తరుణంలో మధ్యలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యిందని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత రవి ఒక ఫ్రెండ్ మాత్రమేనని చెప్పిన లాస్య మరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. అంతే సడన్ గా ఒక ఇంటర్వ్యూలో రవిపై ఆమె నెగిటివ్ కామెంట్స్ చేసినట్లు అనిపించింది. అనంతరం ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఆ దూరం చాలా కాలం కొనసాగింది.
ఇక ఫైనల్ గా బిగ్ బాస్ విన్నర్ అబిజిత్, రవి కజిన్ కావడం వలన మళ్ళీ కలిసినట్లు సమాచారం. ఇటీవల ఇట్స్ టూ పార్టీ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోలో రవి లస్యకు సారి చెప్పినట్లు ఉంది. అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మరి భవిష్యత్తులో వీరి కాంబినేషన్ మళ్ళీ ఇలానే కొనసాగుతుందో లేదో చూడాలి.
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!