సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి చాలా ఆలస్యం చేస్తుంటారు. అటు తర్వాత వెంటనే తల్లిదండ్రులు అవుతారా? అంటే దానికి ఇంకా ఆలస్యం చేస్తుంటారు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు మాత్రం వెంటనే తల్లిదండ్రులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో అలియా భట్ వంటి సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఇటీవల ‘బిగ్ బాస్ 6’ విన్నర్ రేవంత్ కూడా తండ్రయ్యాడు.ఈ క్రమంలో యాంకర్ లాస్య మరోసారి గర్భం దాల్చినట్టు తెలుస్తుంది.
యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న లాస్య పై గతంలో చాలా రూమర్స్ వచ్చేవి. అయితే అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి లెండి. అయితే లాస్య ‘బిగ్ బాస్ 4’ లో అడుగుపెట్టినప్పుడు తాను రెండు, మూడు సార్లు అబార్షన్ చేయించుకున్నట్టు తెలిపింది. ఫలితంగా ఇక తనకు పిల్లలు పుట్టరేమో అని బాధపడుతున్న టైంలో ఆమెకు అబ్బాయి పుట్టినట్టు తెలిపింది. ఇన్నాళ్టికి మళ్ళీ లాస్య తల్లి కాబోతుందట. ఈ విషయాన్ని ఆమె విభిన్న పద్ధతిలో తెలియజేసింది.
‘ఇగో మంజు.. నాకు పీరియడ్స్ సమస్య చిరాకు తెప్పిస్తుంది, బాధిస్తుంది. దీనికి ఏదో ఒకటి చెయ్’ అని లాస్య అడుగగా.. ‘శాశ్వతంగా చేయలేను గానీ ఒక 9 నెలలు పీరియడ్స్… నీ జోలికి రావు’ అంటూ ఆమె భర్త మంజునాథ్ చెప్పాడు. ఫలితంగా లాస్య కడుపులో ఒక కాయ కూడా కాసిందని తెలిపాడట. దీంతో లాస్య గర్భవతి అయ్యిందని స్పష్టమవుతుంది. పీరియడ్స్ పోయాయి, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయం పై ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. భర్తతో కలిసి బెడ్ రూమ్ లో కూర్చుని.. బాధపడుతున్న వీడియో ఒకటి షేర్ చేసింది.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?