లావణ్య త్రిపాఠి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

2012 లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఉత్తర ప్రదేశ్ బ్యూటీ.. ఆ తరువాత మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘దూసుకెళ్తా’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో కూడా నటించింది. అయితే నాని- మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతోనే మొదటి హిట్ ను అందుకుంది ఈ బ్యూటీ. ఆ వెంటనే ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.

‘శ్రీరస్తు శుభమస్తు’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘అర్జున్ సురవరం’ వంటి హిట్ సినిమాలు కూడా ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకూ గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చిన లావణ్య తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఓ ఫోటోషూట్లో పాల్గొనడం అందరినీ షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.ఆ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యగా అవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంత సడెన్ గా ఈమె ఎందుకు ఇంత గ్లామర్ షో చెయ్యడం మొదలుపెట్టిందా అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి.

‘ఇప్పటి వరకూ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చిన లావణ్య.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకోవాలని భావించి ఇలా డోస్ పెంచి ఉంటుంది’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.త్వరలో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మరియు ‘చావు బ్రతుకు చల్లగా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది లావణ్య. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి నెట్టింట్లో వైరల్ అవుతున్న లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus