వెబ్ సిరీస్ ల వైపు అడుగులేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..?

  • February 23, 2019 / 06:33 PM IST

ఇటీవల మన టాలీవుడ్ సెలెబ్రిటీలు వెబ్ సిరీస్ ల పై మక్కువ చూపిస్తున్నారు. తెలుగులో ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లకు సంబందించిన ట్రైలర్లని కూడా రిలీజ్ చేసాడు. ఇక ‘బాహుబలి’ కి సంబంధించి కూడా ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ పేరుతో ఓ వెబ్ సిరీస్ ని ‘పీ.ఎస్.వీ.గరుడవేగా’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మన టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్‌, అమేజాన్‌ లు ఊపందుకున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్‌ లకు మంచి డిమాండ్ ఉంది.

ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్న మరో సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’. ఈ సంస్థ‌ త్వరలో ఓ వెబ్‌సిరీస్ రూపొందించ‌డానికి రెడీ అవుతున్నారు. తన బ్యాన్నేరులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క‌ల్యాణ్ రామ్ ఈ వెబ్ సిరీస్‌ లను రూపొందిస్తున్నారట. ప్రేమ,క్రైమ్, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ ఉంటాయ‌ని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక దీని పై కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… “నెట్ ఫ్లిక్స్‌, అమేజాన్‌లో వ‌చ్చే సిరీస్‌లు యూత్‌ని టార్గెట్ చేసుకుంటూ వ‌చ్చిన‌వే. మేం కూడా అదే పంథా ఫాలో అవ్వ‌బోతున్నాం. నేను నెట్ ఫ్లిక్స్‌లో వ‌చ్చే వీడియోలు త‌ప్ప‌కుండా చూస్తుంటా. డాక్యుమెంట‌రీలంటే చాలా ఇష్టం. వెబ్ సిరీస్ ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాన్ని ఇస్తే… భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప్రాజెక్టులు రూపొందింస్తాం“ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కళ్యాణ్ రామ్ న‌టించిన ‘118’ చిత్రం మార్చి 1న విడుదల కాబోతుంది. గుహ‌న్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు విడుదల చేయబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus