Liger Movie: పూరీ లైగర్ మూవీ అలా ఉండబోతుందా?

  • August 16, 2022 / 12:18 PM IST

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కరణ్ జోహార్ సపోర్ట్ ఉండటంతో హిందీలో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అటు పూరీ కెరీర్ లో ఇటు విజయ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుండగా మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైక్ టైసన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉన్నాయని బోగట్టా. లైగర్ సినిమా 130 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా భారీ లాభాలను అందించింది.

పూరీ జగన్నాథ్, ఛార్మీలకు ఈ సినిమా నిర్మాతలుగా కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి లాభాలను మరింత పెంచే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లైగర్ సక్సెస్ సాధిస్తే విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్నారు.

యువతలో విజయ్ దేవరకొండకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజ జీవితంలో కూడా విజయ్ దేవరకొండ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు విజయ్ దేవరకొండకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus