Bigg Boss 5 Telugu: నాకు వేలు చూపిస్తే కట్ చేసి పారేస్తా: పింకీ

  • October 6, 2021 / 10:59 AM IST

బిగ్ బాస్ హౌస్ లో రానురానూ హౌస్ మేట్స్ బిహేవియర్ మారిపోతోంది. మాస్క్ లు తీసేసి ఆడమంటే ఏకంగా బూతులు మాట్లాడుకుంటూ రెచ్చిపోతున్నారు. సెకండ్ వీక్ లో ఉమాదేవి బూతులు మాట్లాడి వీకెండ్ లెంపలు వేసుకుంది. ఇక ఇప్పుడు ఐదోవార్ కాజల్ ని మిడిల్ ఫింగర్ చూపించి లోబో తన దారుణమైన బిహేవియర్ ని చూపించాడు. అసలు ఏం జరిగిందంటే.., బెడ్ పైన రిలాక్స్ అవుతున్న రవి ఇంకా లోబోల దగ్గరకి వచ్చిన కాజల్. వాష్ రూమ్ నుంచీ నెలరోజులు తర్వాత మీరు డిన్నర్ డిపార్ట్ మెంట్ కి వచ్చారని ఫన్ చేసింది.

అక్కడే రవి ఏదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా కాజల్ అనీమాస్టర్ వైపు వెళ్లిపోతుంది. కాజల్ వెళ్లిపోతోందిలే అనుకుంటూ లోబో మిడిల్ ఫింగర్ చూపించాడు. కాజల్ వెనక్కి తిరిగి అది నోటీస్ చేసింది. లోబో ఏం చేస్తున్నావ్ అంటూ మాట్లాడింది. అక్కడిక్కడే లోబో చేసిన పనిపై ఆర్గ్యూమెంట్ చేసింది. ఇక రవి నువ్వు కిచెన్ లో వర్క్ చేయలేదు అని ఎందుకున్నావ్ అంటూ వేరే విషయం మాట్లాడాడు. అలాగే, లోబో ఫింగర్ చూపించాడు.. నేను ఒప్పుకుంటున్నా.. వాడిది తప్పే అంటూ మాట్లాడాడు రవి. నిజానికి అక్కడ కాజల్ శృతిమించి చేసిన ఫన్ కి, డ్యాన్స్ కి రవి బాగా ఇరిటేట్ అయ్యాడు.

దీనికి లోబో చేతలతో మిడిల్ ఫింగర్ చూపించి విలన్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ ని కాజల్ సీరియస్ గా తీస్కుంది. డైనింగ్ టేబుల్ దగ్గర మానస్ అండ్ పింకీలతో డిస్కస్ చేసింది. నాకు ఎవరైనా అలా చూపించి ఉంటే కట్ చేసి పారేస్తా అంటూ మాట్లాడింది. ఇక్కడే కెప్టెన్ శ్రీరామ్ చంద్ర వచ్చి ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేశాడు. రవిని, కాజల్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇష్యూలో ఇన్వాల్ అయిన మానస్ లోబోని తీస్కుని వచ్చి కాజల్ కి సారీ చెప్పించాడు. ఇక్కడితే ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus