Kotha Lokah: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకుంది

Advertisement

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫిమేల్ సెంట్రిక్ అండ్ సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ‘ప్రేమలు’ నస్లెన్ కీలక పాత్ర పోషించాడు.ఆగస్టు 29న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త లోక’ ని విడుదల చేయడం జరిగింది.

Kotha Lokah Chapter 1 Collections

మొదటి రోజు తెలుగు వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు స్క్రీన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది ఈ చిత్రం. అయినప్పటికీ సెకండ్ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకుంది. ‘ఘాటి’ ‘మదరాసి’ వంటి కొత్త సినిమాలు ఉన్నప్పటికీ ‘కొత్త లోక’ స్ట్రాంగ్ గా నిలబడింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 5.6 cr (షేర్)
కేరళ 22.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.60 cr
ఓవర్సీస్ 33.65 cr
వరల్డ్ టోటల్ 70.67 cr (షేర్)

 

‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ..10 రోజుల్లో .. రూ.70.67 కోట్ల షేర్  సాధించింది. మొత్తంగా రూ.50.67 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరింది. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 10 రోజుల్లో రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతానికి రూ.3.1 కోట్ల ప్రాఫిట్స్ తో డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకుంది.

 ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus