దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా అన్ని రకాలుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.కమర్షియల్ హీరోగానే రాణించాలి అనే తపన అతనిలో ఉండదు. నచ్చిన పాత్రలు చేస్తాడు. కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ చేయడానికి తపిస్తాడు. అందుకే మొదటి నుండి రానాకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
అలాగే పాన్ ఇండియా లెవెల్లో అతనికి క్రేజ్ కూడా ఉంది.హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రానా అంటే తెలియని వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. సినిమా వేడుకల్లో, పబ్లిక్ ప్లేసుల్లో రానా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే తీరు కూడా భలే ఫన్నీగా ఉంటుంది.
విషయంలోకి వెళితే.. రానా ఇటీవల పబ్లిక్ ఈవెంట్ కోసం వెళ్ళాడు. రానా వెళ్ళగానే అక్కడున్న వాళ్ళంతా అతన్ని చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో గుంపులో ఉన్న ఓ అభిమాని రానాని చూడగానే ‘బాహుబలి’ లోని అతని డైలాగ్ చెప్పాడు. ఆ వెంటనే పక్కన ఉన్న మరో వ్యక్తి ‘జై రామ్ చరణ్’ అంటూ అరిచాడు. వెంటనే రానా ‘మాహిష్మతిలోకి రాంచరణ్ ఎందుకు వచ్చాడు’ అంటూ కౌంటర్ వేశాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. దీంతో ఆ అభిమాని ‘రాంచరణ్ మీరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా అన్నా’ అంటూ పలికాడు. ఈ క్రమంలో రానా కూడా సరదాగా నవ్వేసి వెళ్ళిపోయాడు. అలా అక్కడి వాతావరణం అంతా ఫన్నీగా మారిపోయింది.