Bigg Boss 5 Telugu: ఈసారి బిగ్ బాస్ పెద్ద స్కెచ్ వేశాడుగా..!

  • September 18, 2021 / 11:09 AM IST

ప్రతి సంవత్సరం ఎలాగైతే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణాలు నడుస్తాయో ఈసారి కూడా బిగ్ బాస్ సేమ్ టు సేమ్ ఇలాంటి ప్రేమాయణాలే నడిపించేలా కనిపిోస్తున్నాడు. ఇప్పుడిప్పుడే హౌస్ మేట్స్ అందరూ ప్రేక్షకులకి అలవాటు పడుతున్న వేళ బిగ్ బాస్ మరోసారి తన మార్క్ లవ్ స్టోరీస్ ని ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. బిబి న్యూస్ అంటూ హౌస్ లో రవి అండ్ కాజల్ చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. హౌస్ మేట్స్ ని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక్కడే కాజల్ అండ్ రవి మీకు హౌస్ లో లవర్ లాగా ఎవరు కనిపిస్తున్నారు అంటూ శ్రీరామ్ ని, మానస్ ని, సన్నీని ప్రశ్నలు వేశారు.

ఇక ముగ్గురూ కూడా లవర్ అంటే హమీదానే అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడే మరి ఈసారి ఎన్ని లవ్ స్టోరీస్ చూడబోతున్నామో ముందుగానే హింట్స్ ఇచ్చేస్తున్నాడు. అంతకుముందు రాత్రి మానస్ అండ్ లహరి ఇద్దరూ కూడా కిచెన్ లో డిషెష్ ని కడుగుతూ కాసేపు మాట్లాడుకున్నారు. బెడ్ వరకూ సాగనంపిన మానస్ కి లహరి స్వీట్ హగ్ ఇచ్చింది. ఇక మరోసారి మార్నింగ్ లహరి చేతికి మసాజ్ చేస్తూ కనిపించాడు మానస్. అలాగే, శ్రీరామ్ చంద్ర స్విమ్మింగ్ పూల్ దగ్గర హమీద వీపుకి మసాజ్ చేశాడు. ఇలా హౌస్ లో క్యూట్ లవ్ స్టోరీస్ స్టార్ట్ అయిపోయాయి.

ఇక ఫస్ట్ నుంచీ నువ్వంటే క్రష్ అంటూ సిరితో ముచ్చట్లు మొదలుపెట్టాడు జెస్సీ. మరో జంట ఎవరయ్యా అంటే లోబో అండ్ ఉమాదేవి. వీరిద్దరూ కూడా తాము భగ్న ప్రేమికులం అంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ మరి బిగ్ బాస్ లవ్ స్టోరీలకి శుభంకార్డ్ వేస్తాడా.. లేదా ఎలిమినేషన్ రూపంలో ట్రాజడీ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus