దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi ) నిర్మించగా జి.వి.ప్రకాష్ (G. V. Prakash Kumar) సంగీతం అందించాడు. అక్టోబర్ 30 నుండే ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేశారు. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. రెండో రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ మొదటి రోజుతో సమానంగా కలెక్ట్ చేసింది.
ఒకసారి ‘లక్కీ భాస్కర్’ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.97 cr |
సీడెడ్ | 0.71 cr |
ఆంధ్ర(టోటల్) | 2.07 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.13 cr |
ఓవర్సీస్ | 0.19 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 6.07 cr |
‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ చిత్రం రూ.6.07 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.