Bhool Bhulaiyaa 3 Review in Telugu: భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కార్తీక్ ఆర్యన్ (Hero)
  • తృప్తి దిమ్రీ (Heroine)
  • విద్యాబాలన్, మాధురి దీక్షిత్, రాజ్ పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా తదితరులు.. (Cast)
  • అనీస్ బజ్మీ (Director)
  • భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - మురాద్ కేతాని (Producer)
  • సందీప్ శిరోద్కర్ - తనిష్క్ బాగ్చి - సాచిత్ పరంపర - అమల్ మాలిక్ - ఆదిత్య రికారి - లిజో జార్జ్ - DJ చీతాస్ (Music)
  • మను ఆనంద్ (Cinematography)
  • Release Date : నవంబర్ 01, 2024

మలయాళ ఒరిజినల్ “మణిచిత్రతాళు”ను తమిళంలో “చంద్రముఖి”గా తమిళంలో తెరకెక్కించగా అదే పేరుతో తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సౌత్ లో “చంద్రముఖి” సీక్వెల్స్ గా వచ్చిన “నాగవల్లి, చంద్రముఖి 2” డిజాస్టరుగా నిలిచాయి. కానీ అదే “మణిచిత్రతాళు”ను హిందీలో “భూల్ భులాయా”గా రీమేక్ చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఆ సినిమాకి సీక్వెల్స్ తీసి హిట్లు కొడుతూ ఉంది. తాజాగా ఆ సిరీస్ లో భాగంగా వచ్చిన చిత్రం “భూల్ భులయ్యా 3” (Bhool Bhulaiyaa 3). కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), విద్యా బాలన్ (Vidya Balan), మాధురి దీక్షిత్ (Madhuri Dixit), తృప్తి దిమ్రీ (Tripti Dimri) ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నేడు (నవంబర్ 1) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ హారర్ కామెడీ మూడోసారి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Bhool Bhulaiyaa 3 Review

కథ: రూహ్ బాబా (కార్తీక్ ఆర్యన్) పేరుతో దెయ్యాలు తోలేస్తానని అందర్నీ మోసం చేస్తూ పబ్బం గడుపుతుంటాడు రుహాన్. కలకత్తాలో ఉన్న అతడ్ని బ్లాక్ మెయిల్ చేసి మరీ రక్తఘాట్ కి తీసుకొస్తుంది మీరా (తృప్తి). రక్తఘాట్ లో ఉన్న ప్యాలెస్ లో మంజులికా అనే దెయ్యం ఉందని, ఆ దెయ్యాన్ని బయటికి పంపిస్తే ఆ ప్యాలస్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో సెటిల్ అయిపోవాలనుకుంటారు మీరా & ఫ్యామిలీ.

సరిగ్గా అదే సమయానికి ఎంట్రీ ఇస్తారు మల్లిక (విద్యాబాలన్) & మందిర (మాధురి దీక్షిత్). వీళ్లు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. అసలు మంజులికా ఎవరు? రుహాన్ తో ఆమెకున్న సంబంధం ఏమిటి? రుహాన్ ఆ ప్యాలెస్ కు పట్టిన దెయ్యాన్ని వదిలించగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “భూల్ భులయ్యా 3” (Bhool Bhulaiyaa 3) చిత్రం.

నటీనటుల పనితీరు: ముందుగా విద్యాబాలన్ & మాధురి దీక్షిత్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి వాళ్లే మెయిన్ హైలైట్. ముఖ్యంగా ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన సాంగ్ చూడముచ్చటగా ఉంది. ఇక వాళ్ల స్క్రీన్ ప్రెజన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్లిద్దరి ముందు కార్తీక్ ఆర్యన్ తేలిపోతాడేమో అనుకుంటే.. ఇద్దరినీ డామినేట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా రెండో వేరియేషన్ లో అమాయకత్వం, బేలతనం కలగలిసిన హావభావాలతో ఆకట్టుకున్నాడు. హీరోగా కార్తీక్ ఆర్యన్ ను టాప్ లీగ్ లో కూర్చోబెడుతుందీ చిత్రం.

తృప్తి దిమ్రీతో అనవసరమైన ఎక్స్ పోజింగ్ చేయించకుండా, ఆమె యాక్టింగ్ టాలెంట్ ను వినియోగించుకోవడం వల్ల ఆమె పాత్ర చక్కగా ఎలివేట్ అయ్యింది. ఇక సంజయ్ మిశ్రా (Sanjay Mishra), రాజ్ పాల్ యాదవ్ (Rajpal Yadav) కామెడీ ఎప్పట్లానే చక్కగా నవ్వించింది.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా సీజీ వర్క్ టీమ్ పనితనాన్ని మెచ్చుకోవాలి. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో మరో లేయర్ యాడ్ అయ్యింది అనే విషయం అర్థమవుతున్నప్పటికీ, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసం తీసుకున్న జాగ్రత్తలు ప్రశంసార్హం. సినిమా అవుట్ పుట్ చూసి ఇంకాస్త ఖర్చు చేసినట్లున్నారు. అందువల్ల క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. ఆకాష్ కౌశిక్ (Aakash Kaushik) రచన ఈ సినిమాని కాపాడింది అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా మూలకథ ఇదివరకు తెలుగులో మొన్న వచ్చిన “ఓం భీమ్ బుష్”ను గుర్తిచేసినప్పటికీ.. సెన్సిబుల్ గా ట్రీట్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి.

దర్శకుడు అనీజ్ బజ్మీ (Anees Bazmee) నుండి మాత్రం ఈ స్థాయి సెన్సిబిలిటీ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతడి మునుపటి సినిమాలను బట్టి “భూల్ భులయ్యా 3”తో ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి. ముఖ్యంగా మాధురి-విద్యాబాలన్ కాంబినేషన్ సీన్స్ & క్లైమాక్స్ ను చాలా బాగా డీల్ చేశాడు. అలాగే.. కామెడీ విషయంలో “జవాన్” స్పూఫ్ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే “నెట్ ఫ్లిక్స్” జోక్ కూడా భలే పేలింది. ఓవరాల్ గా రేటింగ్ & డైరెక్షన్ టీమ్ ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలపడంలో విజయం సాధించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి టెక్నికాలిటీస్ అన్ని బాగా కుదిరాయి.

విశ్లేషణ: హారర్ కామెడీ ద్వారా సందేశం ఇవ్వడం అనేది లారెన్స్ కాన్సెప్ట్. అతడు తెరకెక్కించిన “ముని, కాంచన, గంగ” సినిమాల్లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది ఆ మెసేజ్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే ఫార్మాట్ ను బాలీవుడ్ ఫాలో అవుతోంది. మొన్న వచ్చిన “స్త్రీ 2”లో ఓ చక్కని మెసేజ్ ను అంతర్లీనంగా అందించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు “భూల్ భులయ్యా 3” తోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యి ఆడియన్స్ ను అలరించగలిగారు. నిజానికి బాలీవుడ్ కి భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ కంటే ఈ తరహా కంటెంట్ ఎంటర్ టైనర్సే బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే బాలీవుడ్ తమ పూర్వ వైభవం తిరిగి సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఫోకస్ పాయింట్: సెన్సిబుల్ కామెడీ ఎంటర్టైనర్!

రేటింగ్: 3/5

 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus