Varun Tej: భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!

వరుణ్ తేజ్  (Varun Tej) , లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్ళయ్యి అప్పుడే ఏడాది పూర్తయింది. 2023 నవంబర్ 1న వరుణ్- లావణ్య..ల వివాహం ఇటలీలో జరిగింది. ప్రస్తుతం ఈ జంట అమెరికాలో ఉన్నట్టు సమాచారం. వరుణ్- లావణ్య మాత్రమే కాదు.. నాగబాబు (Nagababu) , అతని సతీమణి, అలాగే నిహారిక (Niharika) , సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) , వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej)..లు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. దీపావళి పండుగని వాళ్ళు అక్కడే సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పెళ్లి రోజు కావడంతో..

Varun Tej

వరుణ్ లావణ్య స్పెషల్ ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. మంచు కొండల్లో ఉదయిస్తున్న సూర్యుడు.. మధ్య తన భార్య లావణ్యని ప్రేమతో హగ్ చేసుకుని.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు వరుణ్ తేజ్. వీళ్ళ రొమాంటిక్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘మిస్టర్’ (Mister) సినిమాతో వరుణ్ తేజ్, లావణ్య..ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్ టైంలో వీరి మధ్య పరిచయం ఏర్పడటం, తర్వాత ‘అంతరిక్షం’ (Antariksham) సినిమా టైంకి ఇద్దరూ ప్రపోజ్ చేసుకోవడం.. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కడం జరిగింది.

పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. వెబ్ ప్రాజెక్టు ఒకటి చేసినా.. వాటిని కంటిన్యూ చేస్తుంది అంటూ ఏమీ లేదు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా లావణ్య పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక వరుణ్ తేజ్ ఈ ఏడాది ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో ‘మట్కా’ (Matka)  తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక వరుణ్ -లావణ్య..ల యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు

సిద్దార్థ్ – అదితి..ల పెళ్లి వేడుకకు సంబంధించిన రేర్ పిక్స్ వైరల్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus