దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరో హీరోయిన్లుగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటం సినిమాకు ప్లస్ అయ్యాయి. వీక్ డేస్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సి వస్తుంది.
తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి (Lucky Baskhar) 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 7.04 cr |
సీడెడ్ | 1.89 cr |
ఆంధ్ర(టోటల్) | 5.88 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 14.81 cr |
తమిళనాడు | 2.05 cr |
కేరళ | 4.98 cr |
హిందీ | 0.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr (తెలుగు వెర్షన్ ) |
ఓవర్సీస్ | 6.79 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 29.57 cr |
‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం రూ.15.34 కోట్ల షేర్ ను రాబట్టి రూ.3.84 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.29.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.