Dhoom Dhaam Review in Telugu: ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 8, 2024 / 09:49 PM IST

Cast & Crew

  • చేతన్ కృష్ణ (Hero)
  • చేతన్ మద్దినేని (Heroine)
  • వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు.. (Cast)
  • సాయి కిషోర్ మచ్చా (Director)
  • ఎంఎస్ రామ్ కుమార్ (Producer)
  • గోపీ సుందర్ (Music)
  • సిద్ధార్థ్ రామస్వామి (Cinematography)
  • Release Date : నవంబర్ 08, 2024

చేతన్ మద్దినేని, హెబ్బ పటేల్ ప్రధాన పాత్రల్లో సాయికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ “ధూం ధాం” (Dhoom Dhaam) . ఈవారం విడుదలైన ఆరు సినిమాల్లో ఇదొకటి. ఇన్ని సినిమాల నడుమ ఇది నిలవడం అనేది పెద్ద విషయం, మరి విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

Dhoom Dhaam Review in Telugu

కథ: తండ్రి మీద విపరీతమైన ప్రేమాభిమానాలతో పెరుగుతాడు కార్తీక్ (చేతన్ మద్దినేని), అతడి వ్యవహారశైలి నచ్చి అతడ్ని ఇష్టపడుతుంది సుహానా (హెబ్బా పటేల్). ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఏమిటా సమస్యలు? కార్తీక్ ఆ సమస్యలను ఎలా ఎదిరించాడు? చివరికి సుహానాను పెళ్లాడగలిగాడా? అనేది “ధూం ధాం” కథాంశం.

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా హైలైట్ అయ్యింది వెన్నెల కిషోర్. ముఖ్యంగా మందు సిట్టింగ్ సీన్ లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి సీనియర్ యాక్టర్ల డైలాగులు “ఎక్స్ ప్రెషన్స్”తో చెప్పి విశేషంగా ఆకట్టుకున్నాడు. హెబ్బా పటేల్ ఈ తరహా పాత్రలు ఇప్పటికే బోలెడన్ని చేసేసింది కాబట్టి, తన కంఫర్ట్ జోన్ లో సింపుల్ గా నటించేసింది. గోపరాజు రమణ, వినయ్ వర్మ, బెనర్జీ, నవీన్ నేని, ప్రవీణ్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.

హీరో చైతూ మద్దినేని నటుడిగా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. బోలెడుమంది ఆర్టిస్టుల నడుమ నిలదొక్కుకోవడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. కామెడీ సీన్స్ అండ్ రొమాంటిక్ ఎపిసోడ్స్ లో మాత్రం ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు గోపీసుందర్ పాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలోనే ఉంది. సిద్ధార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ముందుగా ఇంతమంది ఆర్టిస్టులను పోలాండ్ తీసుకెళ్లిన ప్రొడ్యూసర్ ను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదని సినిమాలో ప్రతి ఫ్రేమ్ చెబుతూనే ఉంటుంది. ఈమధ్యకాలంలో ఇంతమంది ఆర్టిస్టులను ఒకే ఫ్రేమ్ లో చూడలేదనే చెప్పాలి.

గోపీమోహన్ అందించిన కథ చాలా సాదాసీదాగా ఉంది. ఈ తరహా కాన్సెప్ట్ లు ఇదివరకే కోకొల్లలుగా వచ్చాయి. అయితే.. ఈ కథను దర్శకుడు సాయికిషోర్ మచ్చా హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా పేలవంగా ఉంది. సినిమా మొత్తంలో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశం ఒక్కటే లేకపోవడం గమనార్హం.

విశ్లేషణ: ప్రేక్షకులు అన్నిరకాల సినిమాలకు ఎక్స్ పోజ్ అవుతూ వస్తున్న ఈ తరుణంలో.. కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించడం అంత ఈజీ ఏమీ కాదు. కథనం చాలా పకడ్బందీగా ఉండాలి. ఆ విషయంలో దర్శకనిర్మాతలు ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది.

రేటింగ్: 2/5

ఫోకస్ పాయింట్: ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ రిజర్వేషన్స్!

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus