‘మా’ ఎన్నికల్లో ఆమెనే ఎంపిక చేశారా?

  • July 27, 2021 / 10:28 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలు జరిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందని సినీ అభిమానులు భావించారు. ‘మా’ ఎన్నికల్లో ఐదుగురు సెలబ్రిటీలు పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు పోటీ చేస్తున్న సెలబ్రిటీలలో కొందరు టీవీ ఛానెళ్లలో రచ్చరచ్చ చేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సెలబ్రిటీలు కావాలని చేయకపోయినా ‘మా’ ఎన్నికల వల్ల పరువు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని భావించి పెద్దలు రంగంలోకి దిగారని భోగట్టా. కొంతమంది సెలబ్రిటీలు పోటీ చేయడం వెనుక రాజకీయ పార్టీల కోణం కూడా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘మా’ పెద్దలు గతంలో ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నటికి ‘మా’ పగ్గాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. సహజ నటిగా పేరు తెచ్చుకున్న నటి అధ్యక్ష పదవికి ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే కొంతమంది సెలబ్రిటీలు ఏకగ్రీవానికి అంగీకరించబోమని చెబుతున్న నేపథ్యంలో పోటీ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘మా’ పెద్దలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు కాపాడుకుంటారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్నికలు జరిగితే మాత్రం ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ప్రధానంగా పోటీ జరిగే అవకాశం ఉంది. పకాష్ రాజ్ కు మెగా హీరోల మద్దతు ఉండగా బాలకృష్ణ మద్దతు విష్ణుకు ఉన్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus