కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గత కొద్ది రోజుల క్రితం ఓ వ్యాపారంలో భాగంగా ఒక వ్యక్తి పట్ల మోసానికి పాల్పడ్డారని కొన్ని కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని తిరిగి చెల్లించకుండా తనని మోసం చేశారంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఈయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్మాత రవీందర్ ను అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా రవీంద్ర పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ తన భార్య మహాలక్ష్మి మాత్రం తనని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయకపోవడం కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలతో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఈమెపై ఫైర్ అయ్యారు. భర్త జైల్లో ఉంటే ఇలా సంతోషంగా ఉన్నావేంటి అసలు నువ్వు తనని ప్రేమించే పెళ్లి చేసుకున్నావా లేకపోతే డబ్బు చూసి పెళ్లి చేసుకున్నావా అంటూ భారీగా ట్రోల్ చేశారు.
ఇలా తన భర్త జైల్లో ఉండడంతో మహాలక్ష్మి ఒత్తిడికి గురవడమే కాకుండా తన సన్నిహితుల దగ్గర తన భర్త చేసిన మోసం గురించి మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తుంది. మహాలక్ష్మి తన సన్నిహితుల దగ్గర తన భర్త గురించి చెబుతూ పెళ్లికి ముందు రవీందర్ తనకు ఇలాంటి మోసాల గురించి అసలు చెప్పలేదని ఈ విషయాలన్నీ తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు
అంటూ ఈమె ఆవేదన చెందారట ఇప్పటికే విడాకులు తీసుకొని ఒక కొడుకుతో ఒంటరిగా ఉంటున్నటువంటి ఈమె రవీందర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు ఇలా ఇప్పుడు ఈయన కూడా జైలు పాలు కావడంతో తాను మరోసారి మోసపోయాను అంటూ ఈమె చాలా ఒత్తిడికి గురవుతున్నారు అంటూ ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !