Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుమంత్ (Hero)
  • మీనాక్షి గోస్వామి (Heroine)
  • ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మంజు భార్గవి, బ్రహ్మానందం, సురేష్, వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, తదితరులు (Cast)
  • సంతోష్ జాగర్లపూడి (Director)
  • మధు కలీపు, సురభి లక్ష్మణ్ రావు (Producer)
  • అనూప్ రూబెన్స్ (Music)
  • ప్రతాప్ ఆర్ కృష్ణ (Cinematography)
  • జునైద్ సిద్ధికీ (Editor)
  • Release Date : సెప్టెంబర్ 11 2026
  • 'రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్' 'బ్రిడ్జ్ ఫిలిమ్స్' (Banner)

‘సుమంత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు’ అంటే ‘కచ్చితంగా అందులో మంచి కంటెంట్ ఉంటుంది’ అనే నమ్మకం చాలా మందిలో ఉంది. ‘మళ్ళీ రావా’, ‘అనగనగా’, ఇటీవల వచ్చిన ‘న్యూటన్స్ థర్డ్ లా’ వంటి సినిమాలు క్రిటిక్స్‌ను మెప్పించాయి. ఓటీటీల్లో ఆ సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేశాయి. ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. తనకు ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి డీసెంట్ సినిమాను అందించిన సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై కొంతమేర హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా మ్యాచ్ చేసిందో లేదో తెలుసుకుందాం రండి :

Mahendragiri Varahi Review

కథ : మహేంద్రగిరి అనే ఊరిలో ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది. మరోవైపు మహేంద్రగిరి రాజవంశీయులు ఆ ఊరిలో చేయని ఘోరాలు అంటూ ఉండవు. దాదాపు 500 ఏళ్ల పాటు అక్కడ నివసించే ఆదివాసులను, పూజారులను చిత్రహింసలకు గురిచేస్తూ ఉంటారు. అడ్డొచ్చిన మగవారిని చంపి, ఆడవాళ్లను లొంగదీసుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో ఒకసారి కరువు వచ్చినప్పుడు, వారాహి అమ్మవారి ఆలయంలో అక్కడి జనాలకు ఒక పాప దొరుకుతుంది. ఆ పాపను వారాహి అమ్మవారు ఇచ్చిన వరప్రసాదంగా భావించి, ఆమెకు ‘ముత్యాలమ్మ’ అని నామకరణం చేస్తారు. అప్పటి నుంచీ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ముత్యాలమ్మ కూడా వారాహి అమ్మవారిని ఎంతో నిష్ఠగా సేవిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మహేంద్రగిరి రాజవంశానికి చెందిన ఒక రాజు ముత్యాలమ్మపై అఘాయిత్యానికి పాల్పడతాడు. ఆమెను లొంగదీసుకునే క్రమంలో రాయితో దాడి చేయగా, ఆమె మృతి చెందుతుంది. దీంతో వారాహి అమ్మవారికి కోపం వచ్చి ఆ రాజును క్రూరంగా శిక్షిస్తుంది. అయితే అప్పటి నుంచీ మహేంద్రగిరి రాజవంశానికి చెందిన వారసులు, ముఖ్యంగా మగవారు 33 ఏళ్లకే మరణిస్తూ ఉంటారు. దీంతో వారాహి అమ్మవారే ఆ రాజకుటుంబాన్ని శపించిందని ఊరంతా నమ్ముతుంది. ఆ శాపం భయంతో, రాజేంద్ర వర్మకు (సిద్ధూ జొన్నలగడ్డ) 33 ఏళ్లు వచ్చేసరికి అతని తల్లి శకుంతలా దేవి (మంజు భార్గవి) భయంతో విలవిలలాడిపోతుంది. ఆమె భయపడినట్లుగానే, నెలలు నిండిన తన భార్య సుజాతను (మాళవిక నాయర్) ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రాజేంద్ర వర్మ ప్రమాదానికి గురవుతాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడు? అతని భార్య ఏమైంది? వారికి పుట్టిన బిడ్డ ఏమైంది? వారికీ, సిద్ధార్థ్ (సుమంత్) కుటుంబానికీ సంబంధం ఏమిటి? మహేంద్రగిరి వంశంలోని వరుస మరణాలను సిద్ధార్థ్ ఎలా ఆపగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా..?

నటీనటుల పనితీరు : ఈ సినిమాలో హీరో సుమంత్ అయినప్పటికీ కథ మాత్రం సిద్దూ జొన్నలగడ్డ పాత్రతోనే మొదలవుతుంది. సిద్ధూ ఈ సినిమాలో చేసింది చిన్న కేమియో అనలేం..! అత్యంత కీలక పాత్ర చేశాడు అని చెప్పాలి. తన మార్క్ టైమింగ్ తో ఈ పాత్రని ఎంతో ఈజ్ తో క్యారీ చేశాడు సిద్ధూ. ఇక సుమంత్ ఎప్పటిలానే తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. కాకపోతే అతని లుక్స్ ఒక్కో సీన్లో ఒక్కోలా ఉన్నాయి. ఇక ఆద్య పాత్రలో మీనాక్షి గోస్వామి కూడా బాగా చేసింది. మాళవిక నాయర్ చేసిన కేమియో కూడా బాగుంది. ఐశ్వర్య రాజేష్ కనిపించేది కాసేపే అయినా.. ఈ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకుంది. బ్రహ్మానందం, మంజు భార్గవి, సురేష్, ‘హ్యాపీడేస్’ ఫేమ్ వంశీ చాగంటి వంటి వారికి కూడా ముఖ్యమైన పాత్రలు లభించాయి. వెన్నెల కిషోర్ స్టీరియో టైప్ ను బ్రేక్ చేస్తూ ఓ మంచి పాత్ర చేశాడు. కమల్ కామరాజు,నవీన రెడ్డి వంటి వారు కూడా పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : కొన్నాళ్ళుగా మైథాలజీ లేదా డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొంచెం ఎక్కువ సందడి చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలకి డివైన్ టచ్ ఇస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిందే ఈ ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. సిద్ధూ జొన్నలగడ్డ ట్రాక్ తో సినిమా ఓపెన్ అవ్వడం.. ఆ తర్వాత కాసేపటికి వచ్చే మసీద్ లో దెయ్యాలని చూపించే సీన్, ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ వంటివి బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండాఫ్ పై ఆసక్తిని కలిగించాయి. ఇక కీలకమైన సెకండాఫ్లో హీరో ఇన్వెస్టిగేషన్ ట్రాక్ కొంచెం ఎక్కువైంది. అలాగే బ్యాక్ స్టోరీ కూడా ఇంకాస్త బెటర్ గా తీసుండాల్సింది. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఐశ్వర్య రాజేష్ ఎపిసోడ్ కన్వెన్సింగ్ గా అనిపిస్తుంది. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి సెకండాఫ్ పై ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బ్యాక్ స్టోరీ విషయంలో..! అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. పాటలు పెద్దగా లేవు. అదొక ప్లస్ పాయింట్ ఇలాంటి జోనర్ సినిమాలకి..! నిర్మాణ విలువలు,వీఎఫ్ఎక్స్ వర్క్ సాదా సీదాగానే ఉన్నాయి. అలా అని వంకలు పెట్టి, తక్కువ చేసే విధంగా అయితే లేవు. రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలే ఉండటం ఇంకో ప్లస్ పాయింట్.

విశ్లేషణ : ‘మహేంద్రగిరి వారాహి’.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లిన వాళ్లకి పర్వాలేదు అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. ఇలాంటి కథకి ఇంకొన్ని హై మూమెంట్స్ ఉండి, సెకండాఫ్ ఇంకాస్త బెటర్ చేసి ఉంటే ఫలితం కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పటికైతే ‘వన్ టైం వాచబుల్’ అని మాత్రమే సరిపెట్టగలం.

 

ఫోకస్ పాయింట్ : అక్కడక్కడా మెప్పించే మిస్టికల్ అండ్ డివైన్ థ్రిల్లర్

 

రేటింగ్ : 2.5/5

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus