Mahesh Babu: మహేష్ బాబు ఆ అలవాటు ను కృష్ణ నుంచి నేర్చుకున్నాడంట!

డేరింగ్ అండ్ డైనమిక్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా ఉండటమే కాకూండా 50 ఏళ్ల వయసులో కూడా ఇంకా అందులో సగం అంత వయసువాడిలా కనబడుతూ.. యంగ్ హీరోయిన్స్ పక్కన కూడా ఇతనే ఇంకా యంగ్ గా కనిపించే హీరో. అందుకే మహేష్ బాబుని ఎవరు అడిగినా, అమృతం తాగావా? అసలు నీ డైట్ సీక్రెట్ ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దానికి మహేష్ బాబు క్యూట్ గా ఒక నవ్వు నవ్వుతాడు.

మహేష్ చిన్న వయసులోనే సినిమాల్లో ఎంటర్ అయ్యి, తన ట్యాలంట్ చూపించాడు. మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ఎన్నో ఏళ్ళు అయినా కూడా ఎలాంటి కాంట్రవర్సీ లలో ఉండడు. అలాగే ఎంతమంది హీరోయిన్స్ తో నటించినా ఎవ్వరితోనూ మహేష్ క్లోజ్ గా ఉన్నాడని గాని, ఎఫైర్ ఉందని వార్తలు పెద్దగా రాలేదు. మహేష్ లైఫ్ లో ఓన్లీ నమ్రతను మాత్రమే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరి ప్రేమని కూడా మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా..

నెమ్మదిగా వాళ్ళని ఒప్పించి చాల సింపుల్ గా మహేష్ (Mahesh Babu) నమ్రత పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఇద్దరి పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. అయితే తాజాగా మహేష్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. తన సినిమా లో ఎవరైతే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలి అని మహేష్ బాబు అనుకుంటాడో ఇక ఆ హీరోయిన్ ని ముందు నుంచే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడట.. డాన్స్ ఎలా చేస్తుంది.. ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుంది..

నటన పరంగా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుంది.. రొమాంటిక్ సీన్స్ దగ్గర నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు కూడా ఎలా చేయగలుగుతుంది అనే విషయంపై ఇక ఒకటికి పది సార్లు పరిశీలిస్తూ ఉంటాడట మహేష్ బాబు. ఇక ఆ తర్వాతే సినిమాల్లోకి తీసుకుంటాడట. తన తండ్రి కృష్ణ నుంచి ఈ విషయాన్ని అలవాటును చేసుకున్నాడట మహేష్ బాబు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus