టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత బాగానే పికప్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రలో ఈ మూవీ స్టడీగా రాణిస్తుంది. ‘హనుమాన్’ సినిమా పెద్ద స్థాయిలో కలెక్ట్ చేస్తున్నప్పటికీ.. ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారు. పండుగ సెలవులు ఉండటం కూడా ఈ మూవీకి కలిసొచ్చింది అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ‘గుంటూరు కారం’ సినిమా మొదటి పోస్టర్ నుండి ఎక్కువగా మహేష్ బాబు బీడీ కాలుస్తున్న ఫోటోలని మాత్రమే ఎక్కువగా చూపిస్తూ వచ్చారు. వాస్తవానికి ఒకప్పుడు మహేష్ బాబు స్మోకింగ్ ఎపిసోడ్స్ లో ఎక్కువగా నటించేవారు. కానీ ‘ఖలేజా’ సినిమా నుండి స్మోకింగ్ కి దూరంగా ఉన్నారు. మళ్ళీ ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బీడీ కాలుస్తున్న సీన్లు ఎక్కువగా కనిపించడంతో మళ్ళీ.. స్మోకింగ్ కి బానిసైపోయాడు అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) కాల్చింది ఒరిజినల్ బీడీ కాదట. మొదట చిత్ర బృందం ఒరిజినల్ బీడీ ఇచ్చినప్పటికీ.. దాని వల్ల మైగ్రేన్, తలనొప్పి ఎక్కువవుతుంది అని భావించి మహేష్.. త్రివిక్రమ్ తో ‘నా వల్ల కాదు’ అని చెప్పాడట. దీంతో చిత్ర బృందం ఓ ఆయుర్వేదిక్ పౌడర్ తో తయారు చేసిన ఈ బీడీలను ఏర్పాటు చేశారట. లవంగం వంటి వాటితో ఈ బీడీని తయారు చేసినట్లు మహేష్ తెలిపాడు. సో మహేష్ అభిమానులు ఎవ్వరూ కూడా ప్రభావితం కాకూడదు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!