మహేష్ పనులు తెలిస్తే ఆశ్చర్యపోతారు !!

  • July 19, 2017 / 12:42 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో  ‘స్పైడర్’ సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమాను పట్టాలెక్కించారు. దీని తర్వాత వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయనున్నారు. ఆ తర్వాత మాస్ డైరక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా అనే స్టైల్లో వెళ్తున్న మహేష్ సడన్ గా ఈ స్పీడ్ అందుకోవడం వెనుక ఓ కారణం ఉంది. అది తాజాగా బయటికి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ సాహసాల పేరిట భారీ ఖర్చులు చేశారు, ఆ చిత్రాలు విజయం సాధించినప్పటికీ డబ్బులు మిగిలేవి కావు.. ఇక తన సినిమాతో నష్టపోయిన నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లకు ఆదుకునేవారు. కష్టాల్లో ఉన్నవారు వచ్చి అడిగితే కొన్ని సార్లు అప్పుచేసి మరి సాయం చేసిన సంఘటలను ఎన్నో ఉన్నాయి.

అలా కృష్ణ డబ్బులు వెనకేసుకోకుండా అప్పులు మిగిల్చారు. అవి ఇప్పుడు డబల్ అయ్యాయి. వాటిని తీర్చే స్థాయిలో కృష్ణ లేరు. అలాగే మహేష్ అన్నయ్య రమేష్ బాబు అర్జున్ సినిమా తీసి బాగా నష్టపోయారు. అప్పటి నుంచి కోలుకోలేదు. ఇలా తన కుటుంబ సభ్యుల అప్పులన్నీ తీర్చే బాధ్యతను మహేష్ తీసుకున్నారు. అందుకే  వేగంగా సినిమాలు ఒప్పుకొని వచ్చిన అడ్వాన్స్ తో అప్పులన్నీ క్లియర్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మహేష్ గ్రేట్ అని అభినందిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus