Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

మీరు ఎన్ని మాటలైనా చెప్పండి మాకు రాజమౌళి మీద నమ్మకం ఉంది అని ఆయన ఫ్యాన్స్‌ అంటుంటే.. మరోవైపు సగటు సినిమా అభిమాని కూడా ‘మీరు ఎన్ని మాటలైనా చెప్పండి.. మాకు రాజమౌళి మీద నమ్మకం ఉంది’ అని అంటున్నారు. అయితే ఈ రెండు ‘నమ్మకాలు’ ఒకటి కాదు. తొలి నమ్మకం.. గత కొన్ని నెలలుగా సినిమాను వాయు వేగంతో చిత్రీకరిస్తుండటం అయితే.. రెండో నమ్మకం అయితే రాజమౌళి గత సినిమాలు.

Vijayendra Prasad

గత కొన్ని రోజులుగా ‘వారణాసి సినిమా రిలీజ్‌ విషయంలో రకరకాల పుకార్లు వస్తున్నా.. వార‌ణాసి టీం మాత్రం ఈ ప్ర‌చారంపై స్పందించ‌లేదు. దీంతో రిలీజ్ గురించి టీంలో ఎవ‌రో ఒక‌రు కొంచెం చెబితే బాగుంటుంది అని మహేష్‌బాబు ఫ్యాన్స్‌, రాజమౌళి ఫ్యాన్స్‌ అనుకున్నారు. వారి కోసమే అన్నట్లు రాజ‌మౌళి తండ్రి, వార‌ణాసి క‌థ‌కుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ లైన్లోకి వ‌చ్చారు. సినిమా రిలీజ్‌ విషయంలో మార్పుల్లేవని చెప్పేశారు.

‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ అనే సినిమా ప్రచార కార్యక్రమం ఇటీవల జరిగింది. దానికి విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ ‘వార‌ణాసి’ సినిమా అప్‌డేట్ ఇవ్వ‌మ‌ని అడగ్గా ఏప్రిల్ 7న రిలీజ్ అని ఆల్రెడీ అప్‌డేట్ ఇచ్చేశాం క‌దా అన్నారు. దానికి యాంక‌ర్ నిజంగానే ఆ తేదీకి వ‌స్తుందా అని అడిగితే క‌చ్చితంగా చెప్పిన డేట్‌కే వ‌స్తుంది అని చెప్పారు.

దీంతో ఇటు జక్కన్న అభిమానులు, అటు మహేష్‌ అభిమానులు తెగ ఖుష్‌ అయిపోతున్నారు. ‘వార‌ణాసి’ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని, న‌వంబ‌రులోనే గుమ్మ‌డికాయ కొట్టేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా అదే జోష్‌లో జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఏప్రిల్‌ ఫిక్స్‌ అనుకోవచ్చు. అయితే ఒక్కటే డౌట.. ఏప్రిల్‌లో సినిమా అంటే ఫిబ్రవరిలో జక్కన్న ప్రచారం షురూ చేయాలి. అప్పుడు చేస్తేనే అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయగలుగుతారు.

‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus