విజయ్ ఫ్యాన్స్ కు పోటీగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసేశారు

హీరోలకు అభిమానులు ఉండడం అనేది సర్వసాధారణం. ఈ డిజిటల్ యుగంలో హీరోల సినిమా ఓపెనింగులకు, పుట్టినరోజులకు, హీరోల కెరీర్లో ఇంపార్తెంట్ డేస్ ను హీరో & టీం సెలబ్రేట్ చేసుకోవడానికంటే ముందే అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టి.. సదరు విషయాన్ని సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యేలా చూస్తుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా ఆల్మోస్ట్ అందరు హీరోల విషయంలో ఈ ఫ్యాన్స్ & ట్రెండ్స్ అనేది చాలా కామన్ విషయం.

అయితే.. నిన్న ఉదయం విడుదలైన “టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019” లిస్ట్ లో విజయ్ దేవరకొండ మొదటిస్థానం దక్కించుకోవడం, ఆ విషయాన్ని విజయ్ ఫ్యాన్స్ బాహాటంగా ట్రెండ్ చేయడం, ఆ లిస్ట్ లో మహేశ్ పేరు లేకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. టైమ్స్ సంస్థ ఆల్రెడీ మహేశ్ బాబును “ఫరెవర్ డిజైరబుల్” లిస్ట్ లో షారుక్ ఖాన్ సరసన చేర్చినప్పటికీ.. మహేశ్ ఫ్యాన్స్ ఊరుకోలేదు. #ForeverDesirableSSMB అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలెట్టారు. కొద్దిసేపట్లోనే ఆ ట్రెండ్ ఇండియావైడ్ పాకడంతో షాక్ అవ్వడం మిగతా హీరోల అభిమానుల వంతయ్యింది. దాంతో అందరూ మహేష్ ఫ్యాన్స్ మామూలోళ్ళు కాదయ్యా బాబు అనడం మొదలెట్టారు. ఎంతైనా మహేష్ ఫ్యాన్సా మజాకా?

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus