Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతానికి ఎంతమంది అభిమానులు ఉన్నారో.! ఆయన ఆటిట్యూడ్.. అదే ధోరణి వల్ల తిట్టుకునే వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు మరోసారి ఆయన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.ఇళయరాజా ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi) అనే చిత్రానికి సంగీతం అందించారు. మే 30న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పాటలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందంతో పాటు ఇళయరాజ ఓ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Ilaiyaraaja

ఇందులో ఇళయరాజా మాట్లాడుతూ ‘నా అంతటి సంగీత దర్శకుడు ఈ ప్రపంచంలోనే లేడు. నా లాంటి వాడు ఇంతకుముందు పుట్టలేదు, ఇకపైన పుట్టబోడు కూడా’ అంటూ పలికిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొంతమంది ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ‘రాజాగారికి ఇంత ఆటిట్యూడ్ ఏంటి?’ ‘ఆయన బ*పు మాములుగా లేదు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇళయరాజా కొంతమంది సంగీత ప్రియులకి దేవుడు అనే సంగతి మర్చిపోకూడదు. తెలుగు, తమిళ సినిమాల్లో ఆయన అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆయన పాటలు వింటే మనసుకు ప్రశాంతత, ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని ఫ్యాన్స్ అంటారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  ఒకసారి, ‘అమ్మాయిలు పక్కన లేకపోయినా రొమాంటిక్‌గా, డబ్బు లేకపోయినా రిచ్‌గా ఫీలయ్యే సాయంత్రాలను ఇళయరాజా గారు సృష్టించారు’ అని అన్నారంటే ఆయన సంగీతంలోని మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఈ వీడియోలో ఆ మాటలు పలికిన మాట వాస్తవం. కానీ ఫుల్ వీడియో చూస్తే ఆ మాటలకి ఆయన ఇచ్చిన వివరణ వేరు.

‘ఒక కుగ్రామం నుండి వచ్చి ఎంతోమంది సంగీత పెద్దల వద్ద పనిచేసి.. ఒక్కో సంగీత దర్శకుడి వద్ద ఒక్కో క్వాలిటీ నేర్చుకుని.. అభ్యసించి సంగీత దర్శకుడిగా మారాను. నాలా అంతకు ముందు ఎవరూ లేరు.. ఆ తర్వాత ఎవరూ రారు..అని ఆ సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. అంత గొప్ప సంగీత దర్శకుడు అతిశయించడంలో తప్పేమీ లేదు. ట్రోల్ చేసే వారు ఆయన వర్క్ గురించి మొత్తం తెలుసుకుని ట్రోల్ చేస్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం.

ఏదేమైనా కొన్నేళ్లుగా ఇళయరాజా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తన పాటలను పబ్లిక్‌గా వాడితే కాపీరైట్ క్లెయిమ్స్ చేయడం, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) తన పాటలను కచేరీలలో పాడటంపై అభ్యంతరం చెప్పడం వంటివి విమర్శలకు దారితీశాయి.అయినప్పటికీ ఇళయరాజా బలంగా నిలబడ్డారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus