కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జూన్ 19, 2025 న జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా డీఎంకే పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మక్కల్ నీది మయ్యం తరపున కమల్ హాసన్ పేరు కూడా ఉంది. ఎంఎన్ఎం కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాజ్యసభకి కమల్ ను పంపించబోతున్నట్టు స్పష్టం చేసింది. డీఎంకే, మక్కల్ నీది మయ్యం పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు ప్రకారం కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
మరోపక్క కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ నటించిన ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కానుంది. శింబు (Silambarasan) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. త్రిష (Trisha) , అభిరామి (Abhirami) హీరోయిన్లుగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ‘థగ్ లైఫ్’ సినిమా కన్నడ ప్రమోషన్ల కోసం ఇటీవల కమల్ బెంగళూరు వెళ్లడం జరిగింది.
అక్కడ మీడియాతో ముచ్చటించిన కమల్.. ‘ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) తన కుటుంబంలో వ్యక్తి లాంటి వారు… అందుకే ఇక్కడికి వచ్చాను. మీ భాష(కన్నడ) కూడా తమిళం నుండే పుట్టింది’ అంటూ పలికారు. ఆ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. కన్నడిగులు ఈ విషయం పై కమల్ హాసన్ ను ట్రోల్ చేస్తున్నారు.