Mahesh Babu: ఆ అనుమానాలు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్కారు వారి పాట రిలీజ్ కావడానికి మరో నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా ఆ రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్ రాలేదు. త్వరలో సర్కారు వారి పాట సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Click Here To Watch Trailer

అయితే ఆ సాంగ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం మహేష్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. పరశురామ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో సర్కారు వారి పాట తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు అభిమానులు మైత్రీ మూవీ మేకర్స్ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారింది.

మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా విడుదలై దాదాపుగా రెండున్నరేళ్లు అవుతోంది. మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి త్వరగా అప్ డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

మహేష్ సర్కారు వారి పాట సినిమాను విడుదల చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాతో, రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు. మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus