Mahesh: మహేష్ చేసిన పనికి ఇప్పటికీ బాధపడుతున్నాడట..!

  • July 10, 2023 / 01:39 PM IST

సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు ఎంత మంచి వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల కోసం నేనున్నానంటూ సహాయం అడగకపోయినా చేసే మంచి మనసున్న హీరో. ఆయన ఎందరో చిన్నారులకు ఉచితంగా గుండె జబ్బులకు వైద్యం చేపించి ఎంతో మంచి జీవితాన్ని అందిస్తున్నారు హీరో మహేష్ బాబు.. అంత మంచి వ్యక్తి తన తల్లి చివరి కోరికను తీర్చలేకపోయాడన్న వార్త ఇప్పుడు అభిమానులకు మరింత బాధ కలిగిస్తోంది. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే.

కానీ మహేష్ బాబు ఆ బాధను తట్టుకోలేక కొన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.. ఆ తర్వాత మళ్లీ సినిమాల మూడ్ లోకి వచ్చాడు. కాగా, మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. కానీ మహేష్ బాబు తన తల్లికి ఇష్టమైన పనిని కూడా చేయలేకపోయాడనే వార్త అభిమానులను చాలా బాధిస్తోంది. ఫ్యాన్సే కాదు ఆయన కూడా చాలా బాధపడుతున్నాడట.

మొదటి నుంచి (Mahesh) మహేష్ బాబు తల్లికి సితార అంటే చాలా ఇష్టం. అందుకే సితారకు తాను బతికుండగానే ఓనీల ఫంక్షన్ చేయమని కోరింది. అయితే మొదటి నుంచి ఇలాంటి వాటిపై పెద్దగా దృష్టి పెట్టని మహేష్ బాబు.. దానిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు ఆ కోరిక తీరకుండానే ఇందిరాదేవీ చనిపోయింది. అయితే ఈమేరకు మహేష్ బాబు ఆ ఫంక్షన్ చేసి తన తల్లి లేకపోయినా ఆ కోరిక తీర్చకుండా సైలెంట్ అయ్యాడంటూ పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus